Heavy Rains : కడప జిల్లాలో భారీ వర్షాలు.. నాలుగు కంట్రోల్ రూములు ఏర్పాటు

కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది.

Heavy Rains : కడప జిల్లాలో భారీ వర్షాలు.. నాలుగు కంట్రోల్ రూములు ఏర్పాటు

Kadapa

Updated On : November 11, 2021 / 9:35 PM IST

Heavy rains in Kadapa : కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక బలగాలు, బృందాలతో సర్వసన్నద్ధం చేసింది. ప్రత్యేక బలగాలతో బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పోలీసు సబ్ డివిజన్ లో ఒక రెస్క్యూ టీమ్ సిద్ధం చేశామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సహాయచర్యల నిమిత్తం తాళ్లు, బాటన్ లతో సంసిద్ధంగా ఉంచామని తెలిపారు.

Fishermen : సముద్రంలో చిక్కుకున్న 11 మంది మత్స్యకారులు

మూడు రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు – 08562 – 246344, 08562-244437. కడప రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ : 08562-295990. రాజంపేట రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ : 08565 -240066.
జమ్మలమడుగు రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ : 9966225191.