Fishermen : సముద్రంలో చిక్కుకున్న 11 మంది మత్స్యకారులు

నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లి 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు.

Fishermen : సముద్రంలో చిక్కుకున్న 11 మంది మత్స్యకారులు

Fishermen

fishermen Trapped at the sea : నెల్లూరు జిల్లాలో చేపల వేటకు వెళ్లి 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. అల్లూరు మండలం తాటిచెట్లపాళెంకు చెందిన మత్స్యకారులు బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. ఇంజిన్ లో సమస్య తలెత్తడంతో మైపాడు వద్ద సముద్రంలో బోటు నిలిచిపోయింది. దీంతో బోటులోని మత్స్యకారులందరూ సముంద్రంలో చిక్కుకున్నారు.

రాష్ట్ర ఆఫ్కాఫ్‌ చైర్మన్‌ కొండూరు అనీల్‌ బాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఫోన్ లో మత్స్యకారులతో కొండూరు అనీల్‌ బాబు మాట్లాడారు. మత్స్య కారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు కృష్ణపట్నం కోస్ట్ గార్డ్స్ ప్రయత్నిస్తున్నారు.

Telugu University : నవంబర్ 17న తెలుగు విశ్వ‌విద్యాల‌యం ప్రవేశ పరీక్షలు

మరోవైపు వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, నాయుడుపేటలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నాలుగు మండలాల్లో 2850 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి.

తడలోని అపార్ట్ మెంట్స్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరులో రమేష్ రెడ్డి నగర్, కలెక్టరేట్ సమీపంలో చెట్లు కూలిపడ్డాయి. దీంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.