విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

heavy traffic jam on vijayawada hyderabad highway

Updated On : June 24, 2024 / 5:13 PM IST

vijayawada highway: నిత్యం రద్దీగా ఉండే విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గంటలకొద్ది ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్ద ఓ లారీ ప్రమాదానికి గురైంది. కంకర లోడుతో వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. దీంతో హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ప్రమాదానికి గురైన లారీని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. విజయవాడ – హైదారాబాద్ హైవేపై ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Also Read : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు, ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..