High Court Decission: ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టు తీర్పు నేడే!

కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవల్స్‌ పెరిగేందుకు ఆనందయ్య కంట్లో పసరు మందు పోసేవారు. ఐ డ్రాప్స్‌ పనితీరుపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు.. ఇవ్వాళ ఇవ్వనుంది.

High Court Decission: ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టు తీర్పు నేడే!

High Court Decission On Anandaiah Medicine Today

Updated On : June 7, 2021 / 10:42 AM IST

Anandaiah Medicine: కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవల్స్‌ పెరిగేందుకు ఆనందయ్య కంట్లో పసరు మందు పోసేవారు. ఐ డ్రాప్స్‌ పనితీరుపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు.. ఇవ్వాళ ఇవ్వనుంది. జాతీయ ఆయుర్వేద పరిశోధన మండలి నుంచి ఆనందయ్య కంటి చుక్కల మందుపై నివేదిక అందడంతో సర్కార్ అభ్యంతరం లేదని తెలిపింది.

ఆనందయ్య తయారు చేసిన కంట్లో చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే చుక్కల మందు పంపిణీకి మూడు నెలల సమయం పడుతుందని స్పష్టం చేసింది. నేరుగా కరోనా బాధితులకు, వారి బంధువులకు మందు పంపిణీ చేయలేమని హైకోర్టుకు స్పష్టంచేసింది. చావుబతుకుల మధ్య ఉన్నవారికి మందు పంపిణీ చేయకపోవడం ఆర్టికల్‌ 21 ప్రకారం చట్టవిరుద్దమని న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు.

బాలాజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ఆనందయ్య కంటి చుక్కుల మందు పంపిణీపై ఇవాళ(07 జూన్ 2021) ఆర్డర్స్‌ ఇవ్వనుంది.