Vinukonda : వినుకొండలో హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. కాల్పులు జరిపిన పోలీసులు

వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. Vinukonda TDP YSRCP Clash

Vinukonda : వినుకొండలో హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. కాల్పులు జరిపిన పోలీసులు

Vinukonda TDP YSRCP Clash

Vinukonda TDP YSRCP Clash : పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. రాళ్ల దాడి చేసుకున్నాయి. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నేతలు అక్రమాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు బస్టాండ్ దగ్గర నిరసనకు దిగారు.

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి గాల్పులు కూడా జరిపారు పోలీసులు.

Also Read..Gannavaram: గన్నవరం వైసీపీలో మూడు వర్గాలు.. దుట్టా, యార్లగడ్డ, వంశీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమా?

రాళ్ల దాడిలో కొందరికి గాయాలయ్యాయి. ఘర్షణను నిలువరించేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీచార్జి కూడా జరిపారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు వినుకొండ సీఐ గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇవాళ బస్టాండ్ దగ్గరికి వచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అదే సమయంలో వైసీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్రిక్తతలకు, ఘర్షణలకు దారితీసింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారుపడ్డారు.

Also Read..Roja Selvamani : వారి జీవితాలను నాశనం చేసి కాల్పులు జరిపించిన ఘనుడు చంద్రబాబు- మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు