రికార్డ్ స్థాయిలో 5 లక్షల మందితో యోగాడే నిర్వహణకు ప్లాన్ ఏ, ప్లాన్ బీ వేసుకున్నాం.. మోదీ వస్తున్నారు: హోం మంత్రి అనిత
ఆల్టర్నేట్ వేదికగా ఆంధ్రా యూనివర్సిటీలో గ్రౌండ్స్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

Home Minister Vangalapudi Anitha
విశాఖలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ యోగాడేకి హాజరవుతారని తెలిపారు.
విశాఖ బీచ్ రోడ్డులో 5 లక్షల మందితో యోగా డే రికార్డ్ స్థాయిలో జరుగుతుందని అనిత తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా చేయించేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారని అన్నారు. బీచ్ రోడ్డులో 33 బ్లాకుల్లో యోగా డే జరుగుతుందని తెలిపారు.
Also Read: ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్న వైఎస్ జగన్
వర్షాలు కురిసినా సరే ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందించామని అనిత చెప్పారు. వర్షం పడితే ఆల్టర్నేట్ వేదికగా ఆంధ్రా యూనివర్సిటీలో గ్రౌండ్స్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యోగాడే నిర్వహణకు ప్లాన్ ఏ, ప్లాన్ బీని కూడా వేసుకున్నామని చెప్పారు.
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమర్థవంతంగా జరుపుతామని అనిత తెలిపారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 11వ యోగ దినోత్సవాన్ని విశాఖలో జరిపి సరికొత్త రికార్డు నెలకొల్పుతామని చెప్పారు.