వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ ఎలా.. అసలు ఎలా లెక్కిస్తారు? ఎంత బీమా ఇస్తారు? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా? ఎలా లెక్కిస్తారు? బీమా సొమ్ము ఎంత వస్తుంది?

వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ ఎలా.. అసలు ఎలా లెక్కిస్తారు? ఎంత బీమా ఇస్తారు? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

Car Insurance : గతంలో ఎన్నడూ సంభవించని వరదలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ, ఖమ్మం నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. పెద్ద సంఖ్యలో కార్లు, బైక్ లు వరదలో కొట్టుకుపోయాయి. అపార్ట్ మెంట్ సెల్లార్లలో ఉన్న కార్లు సైతం నీట మునిగాయి.

వరదల కారణంగా తమ వాహనాలు పాడవటంతో వాహనదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన లేదా దెబ్బతిన్న కార్లకు ఇన్సూరెన్స్ వస్తుందా? లేదా? అనే అయోమయంలో పడిపోయారు. మరి ఇంతకీ వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా? ఎలా లెక్కిస్తారు? బీమా సొమ్ము ఎంత వస్తుంది?

వరదల్లో దెబ్బతిన్న కార్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే, కొత్తగా తీసుకున్న కార్లకు చేసిన ఇన్సూరెన్స్ ఆధారంగా రిపేర్, విడిభాగాల స్థానంలో కొత్తవి మార్చడం చేస్తారు. కాబట్టి ముందుగా కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలాంటిదో తెలుసుకోవాల్సి ఉంటుంది. నీటిలో మునిగిన కార్లలో ముఖ్యంగా ఇంజిన్, గేర్ బాక్స్ డ్యామేజ్ అవుతుంటాయి. ఇవి ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయో లేదో తెలుసుకోవాలి. వరదలో కారు మునిగినట్లు అయితే వెంటనే ఇన్సూరెన్స్ అధికారులను సంప్రదించడం ఉత్తమం. కారుకు సంబంధించిన ఫొటోలను ఇన్సూరెన్స్ సంస్థకు పంపించాల్సి ఉంటుంది.

అప్పుడు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ని పంపుతుంది. దీని సాయంతో వరదలతో దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ పొందొచ్చు.

కారు కోసం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ విలువ ఆధారంగా ఇన్సూరెన్స్ మొత్తాన్ని లెక్కకడతారు.
* ముందుగా కారుకు డ్యామేజ్ జరిగితే రిపేర్ చేస్తారు.
* పాడైపోయిన విడి భాగాల స్థానంలో కొత్తవి బిగిస్తారు.
* కారు తరుగుదల ఆధారంగా నిర్ణయించిన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ప్రకారం కవరేజ్ నిర్ణయిస్తారు.
* కారు ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేసుకున్నప్పుడు డిప్రిసియేషన్ లెక్కిస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి లభించే పరిహారం కారు వయసుపై ఆధారపడి ఉంటుంది.

* కారు కోసం తీసుకున్న ఇన్సూరెన్స్ ప్లాన్ లో ఇంజిన్ ప్రొటెక్షన్ ఆప్షన్ కూడా ఉంటే దాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
* ఇంజిన్ ప్రొటెక్షన్ కవరేజ్ లేకపోతే ఇంజిన్ రిపేర్ కోసం లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
* కారు ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో జీరో డిప్రిసియేషన్, యాడాన్ ను కొనుగోలు చేసుంటే డిప్రిసియేషన్ లేకుండా పరిహారం పొందొచ్చు.
* వరదల కారణంగా దెబ్బతిన్న కార్లను ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా వర్గీకరిస్తారు.
* పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన కార్లను ఏ కేటగిరీ కింద గుర్తిస్తారు.
* సీట్ల వరకు మునిగిన కార్లను బీ కేటగిరీలో, సీటు కింద వరకు మునిగిన కార్లను సీ కేటగిరీలో, మ్యాట్ వరకు మునిగిన కార్లను డీ కేటగిరీగా పరిగణిలోకి తీసుకుంటారు.
* ఏ, బీ కేటగిరీ కేసుల్లో సాధారణంగా నీరు ఇంజిన్ లోకి చేరుతుంది. దీన్ని పూర్తి నష్టంగా పరిగణిస్తారు.

 

Also Read : విజయవాడలో మునిగిన లక్షలాది బైక్‌లు.. మెకానిక్‌లకు ఫుల్ డిమాండ్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?