Fire Broke Out : కడపలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం.. షాపు దగ్ధం, రూ.2కోట్ల ఆస్తి నష్టం
సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

fire broke out (2)
Fire Broke Out In Kadapa : కడపలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వైవీ స్ట్రీట్ లోని ఓ హోల్ సేల్ సరుకుల దుకాణంలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో దుకాణం మొత్తం దగ్ధమైంది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి అగ్ని ప్రమాదమే కారణమని గుర్తించారు. చుట్టు పక్కల జనం భయాందోళనకు గురయ్యారు. బద్రి నారాయణ హోల్ సేలు దుకాణంలో 12 నుంచి ఒంటి గంట మధ్యలో షార్ట్ సర్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
Delhi fire : ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..9మందికి గాయాలు
అప్పటి నుంచి ఇప్పటివరకు మంటలు ఎగిసిపడుతూనేవున్నాయి. మంటలను అదుపు చేసేందుకు రాత్రి నుంచి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటివరకు మంటలు అదుపులోకి రాలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో కాస్త మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ రెండో ఫ్లోర్ లో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి.
ఎందుకంటే అక్కడ ఆయిల్ ప్యాకెట్లతోపాటు కొన్ని ప్లాస్టిక్ వస్తువులు అధికంగా ఉండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మంటలు అదుపులోకి రాకుండా ఇబ్బంది పెడుతున్నాయి. వైవీ స్ట్రీట్ కడప నగరానికి వ్యాపార అడ్డగా ఉంది. వైవీ స్ట్రీల్ ఇరుకైన ప్రదేశం. చుట్టుముట్టు భవనాలు ఉండటంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డాయి.