ఎనీ డౌట్ : హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా – బాబు

‘తాను చేసిన ప్రణాళిక వల్ల హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి అయ్యింది..ఇలా చేయడం ఆత్మకు తృప్తి కలుగుతుంది..ఐటీ కాలేజీల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయి..వైసీపీ చేస్తున్న తప్పుడు పనుల వల్ల యువతకు నష్టం కలుగుతుంది’ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి వ్యాఖ్యానించారు. తన ప్రాణం కోసం భయపడ..రాష్ట్రం ఏమవుతుందో ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం ఇసుక కొరతపై ధర్నా చౌక్‌లో బాబు దీక్ష చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష..రాత్రి 8 గంటలకు ముగిసింది.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…ఏపీ రాష్ట్రం చాలా నష్టపోయిందని, చరిత్ర కలిసి రాలేదు..భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పోరాటం చేసింది పొట్టి శ్రీరాములు అని గుర్తు చేశారు. తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలని..హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాష్ట్రం ఏర్పడిందని..60ఏళ్లు కష్టపడ్డాం.. అనంతరం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని మరోసారి చెప్పారు బాబు. కష్టపడుతాం..రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాను ఎన్నో కార్యక్రమాలు చేశానని తెలిపారు.
33 వేల 500 ఎకరాలు..రాజధాని కోసం స్వచ్చందంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములు ఇచ్చారన్నారు. నీతి, నిజాయితీగా పారదర్శకంగా అమరావతిని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ ప్రభుత్వం వెనక్కి వెళ్లడం తనను బాధించిందన్నారు. ఎన్న కంపెనీలు వెనక్కి వెళ్లాయని, మరోసారి కంపెనీలు ఏపీ రాష్ట్రానికి వస్తాయా ? అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంపై సీఎం జగన్‌కు ఎందుకంత కసి..కక్ష అని బాబు నిలదీశారు.
Read More : జగన్‌కు విష్ణుకుమార్ రాజు సపోర్టు : ఇంగ్లీష్ భాష అవసరమే