Karumuri Nageswara Rao : వివేకా హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడని నా అనుమానం : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ ఇవ్వలేదు.. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఇస్తాను అంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రజల్ని మరోసారి వంచన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు.

Karumuri Nageswara Rao : వివేకా హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడని నా అనుమానం : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Karumuri Nageswara Rao

Updated On : April 21, 2023 / 2:54 PM IST

Karumuri Nageswara Rao : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు చేశారు. పుట్టినరోజు నాడు కూడా చంద్రబాబు 420 మాటలు మానలేదని ఎద్దేవా చేశారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చెయ్యడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ ఇవ్వలేదు.. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఇస్తాను అంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రజల్ని మరోసారి వంచన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు. శుక్రవారం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు.

తోడబుట్టిన వాడు గదిలో మగ్గుతుంటే కనీసం చూడటానికి కూడా వెళ్ళలేదని విమర్శించారు. తల్లి దండ్రులకు కనీసం తలకొరివి పెట్టలేని దుర్మార్గుడు చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడుకు భవిష్యత్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులకు ఏమీ మంచి చేశావని ప్రశ్నించారు. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆ కుటుంబాన్ని నిలువులా మోసం చేశావని విమర్శించారు.

Karumuri On Early Elections : ఏపీలో ముందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

జగన్ పై ఏదో రకంగా బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అందరికీ తెలియాలా..? అని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లు వివేకా హత్య జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉందన్నారు. మూడు నెలలు వాళ్ళు విచారణ చేశారని.. ఆనాడు ఎందుకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు రాలేదని ప్రశ్నించారు. తక్షణమే సీబీఐ చంద్రబాబును విచారించాలని కోరారు. హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడని తమ అనుమానమని పేర్కొన్నారు.