IAF Chopper Crash : మరణంలోనూ కలిసే వెళ్లారు..నేను ఉన్నంత వరకు నువ్వు ఉండు

బిపిన్‌ రావత్‌ ఇచ్చిన ధైర్యంతో.... సాయితేజ ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగారు. పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు.

IAF Chopper Crash : మరణంలోనూ కలిసే వెళ్లారు..నేను ఉన్నంత వరకు నువ్వు ఉండు

Indian Army

Updated On : December 10, 2021 / 7:43 PM IST

Lance Naik Sai Teja : ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజకు సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. భారత సైన్యంలో అంచెలంచెలుగా పట్టుదలతో ఎదుగుతున్న సాయితేజకు స్వయంగా బిపిన్‌ రావత్‌ ప్రోత్సాహం అందించారు. పారా కమాండోలకు సాయితేజ మెరుగ్గా శిక్షణ ఇస్తుండడంతో… తన వ్యక్తిత భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారు బిపిన్‌ రావత్‌. సాయితేజ కూడా బిపిన్‌ను కంటికి రెప్పలా చూసుకునేవారు.

Read More : Jawan Sai Teja : సాయితేజ మృతదేహం కోసం ఎదురు చూపులు

సాయితేజను ఆర్మీలో వద్దని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరగడంతో…సైన్యం నుంచి వైదొలుగుతానని చెప్పారు. అయితే సాయితేజకు ఆ సమయంలో పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు. నేను ఉన్నంత వరకు నువ్వూ ఉండూ సాయి అని రావత్‌ చెప్పారు. అంతేకాదు… బిపిన్‌ రావత్‌ ఏకంగా సాయితేజ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. సాయితేజకు ఏమీ కాదని.. అందుకు తానే భరోసా అని చెప్పినట్టు సాయితేజ తండ్రి మోహన్‌ తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య ఇన్నాళ్లు నెలకొన్న అనుంబంధం బయటకొచ్చింది.

Read More : Omicron Tension : నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్..ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్

బిపిన్‌ రావత్‌ ఇచ్చిన ధైర్యంతో…. సాయితేజ ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగారు. పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. సాయితేజ పనితనం మెచ్చిన బిపిన్‌ రావత్‌ ఏకంగా తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారు. ఎక్కడికి వెళ్లినా సాయితేజను వెంటతీసుకుని వెళ్లేవారు. చివరికి మరణంలోనూ ఇద్దరూ కలిసే వెళ్లడం అందరినీ కలిచి వేస్తోంది.