Omicron Tension : నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్..ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్

ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Omicron Tension : నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్..ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్
ad

corona for four members of the same family : ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవర పెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవలే బాధితులు అమెరికా నుంచి కావలికి వచ్చారు. బాధితుల్లో ఇద్దరు ప్రముఖ వైద్యులు ఉన్నారు. బాధితుల ఆస్పత్రిలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో ల్యాబ్ రిపోర్టులు రానున్నాయి.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా భారత్ లో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో మరో రెండు, మహారాష్ట్రలో ఒక కొత్త వేరియంట్ కేసును గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 26కు చేరింది.

Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి

గుజరాత్ లోని జామ్ నగర్ లో మరో రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటీవలే జింబాబ్వే నుంచి భారత్ కు వచ్చిన ఎన్ ఆర్ఐలో ఒమిక్రాన్ వెలుగుచూసింది. ఇప్పుడు అతని భార్య, బావమరిదికి కూడా కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు జామ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.

మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వచ్చిన 49ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 4న అతడు టాంజానియా నుంచి వచ్చాడు. ప్రస్తుతం అతడు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.