Anil Kumar Yadav : “నా ఆస్తులు ఎన్నో ధైర్యంగా చెబుతున్నా.. దమ్ముంటే మీ ఆస్తులేవో చెప్పండి” : లోకేష్ కు అనిల్ కుమార్ సవాల్

సోమిరెడ్డి తనవి ఉత్తుత్తి ప్రమాణాలు అన్నారు.. కనీసం సోమిరెడ్డి వచ్చి లోకేష్ చెప్పిన ఆస్తులు తనవేనని ఎందుకు ప్రమాణం చేయలేక పోయారని ప్రశ్నించారు.

Anil Kumar Yadav : “నా ఆస్తులు ఎన్నో ధైర్యంగా చెబుతున్నా.. దమ్ముంటే మీ ఆస్తులేవో చెప్పండి” : లోకేష్ కు అనిల్ కుమార్ సవాల్

Anil Kumar Challenged Lokesh

Anil Kumar Challenge Lokesh : నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ నాయకుడు నారా లోకేష్, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గత కొద్ది రోజులుగా ఇద్దరూ పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. నారా లోకేష్ ఆరోపణలు తప్పని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే అనీల్ కుమార్ ప్రమాణం చేశారు. శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అనీల్.. అనిల్ బినామీ ఆస్తులంటూ.. లోకేష్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడారు. తనకు వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని లోకేష్ ఆరోపించారని పేర్కొన్నారు. లోకేష్ ఇచ్చిన చిట్టాలో తన ఆస్తి పట్టుమని రూ.7 కోట్లు కూడా లేదని.. కానీ, తనకు వారసత్వంగా వచ్చిన కోట్ల విలువైన ఆస్తి ఉందన్నారు. స్వామి వారి సాక్షిగా అంతకు మించి తాను ఎలాంటి ఆస్తులు కొనలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా లేఅవుట్లలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. లోకేష్ ని ప్రమాణం చేయడానికి రమ్మని పిలిచినా రాలేదన్నారు.

Bandi Sanjay : నిజమైన హిందువని చెప్పుకునే సీఎం కేసీఆర్ ఎందుకు గజ్వేల్ ఘటనపై స్పందించడంలేదు : బండి సంజయ్

అయితే, తాను చెప్పిన విధంగానే వచ్చి ప్రమాణం చేశానని తెలిపారు. లోకేష్ ఇచ్చిన లిస్ట్ లో లేని ఒక ఆస్తి తాను కొన్నానని వెల్లడించారు. స్నేహితులతో కలిసి కొన్న ఆస్తి ఒకటి ఉందని.. ఆ భూమిలో ఒక లేఅవుట్ వేశానని చెప్పారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల ఖర్చుకు అవసరం ఉంటుందని తెలిపారు. గతంలో ఎన్నికల కోసం ఆస్తులు అమ్ముకున్నానని.. మళ్లీ ఆస్తులు అమ్ముకోవడానికి సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.

సోమిరెడ్డి తనవి ఉత్తుత్తి ప్రమాణాలు అన్నారు.. కనీసం సోమిరెడ్డి వచ్చి లోకేష్ చెప్పిన ఆస్తులు తనవేనని ఎందుకు ప్రమాణం చేయలేక పోయారని ప్రశ్నించారు. “నా ఆస్తులు ఎన్ని అనేది నేను ధైర్యంగా చెబుతున్నా.. దమ్ముంటే మీ ఆస్తులేవో చెప్పండి” అంటూ లోకేష్ కు అనిల్ కుమార్ సవాల్ విసిరారు. తన ఆస్తులపై సీబీఐ ఎంక్వయిరీకి కూడా సిద్ధమని పేర్కొన్నారు.