Perni Nani : నీకు దమ్ముంటే, నువ్వు ఎన్టీఆర్ మనవడే అయితే అక్కడి నుంచి పోటీ చేయ్- నారా లోకేశ్‌కు పేర్నినాని సవాల్

వాళ్ళని చూస్తే మీకెందుకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. అప్పుడేమైనా ఇస్రో శాస్త్రవేత్త కాదు కదా..?Perni Nani - Nara Lokesh

Perni Nani : నీకు దమ్ముంటే, నువ్వు ఎన్టీఆర్ మనవడే అయితే అక్కడి నుంచి పోటీ చేయ్- నారా లోకేశ్‌కు పేర్నినాని సవాల్

Perni Nani - Nara Lokesh (Photo : Google)

Updated On : August 23, 2023 / 5:16 PM IST

Perni Nani – Nara Lokesh : ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార, ప్రతిపక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వైసీపీ, టీడీపీ నాయకుల నడుమ మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం రాష్ట్ర రాజకీయాలను హాట్ హాట్ గా మార్చేసింది.

నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా-నారా లోకేశ్
నిన్న గన్నవరంలో యువగళం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ నాయకులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ టార్గెట్ గా లోకేశ్ చెలరేగిపోయారు. గుడివాడలోనే నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తాను అని కొడాలి నానికి, పిల్ల సైకోకి భయం పరిచయం చేస్తాను అని వంశీకి.. లోకేశ్ హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.(Perni Nani)

లోకేశ్ వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. లోకేశ్ పై ఎదురుదాడికి దిగారు. మాజీమంత్రి పేర్నినాని నారా లోకేశ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

Also Read..Nara Lokesh : నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా- నిప్పులు చెరిగిన నారా లోకేశ్

తండ్రి ఫ్యామిలీ గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి లోకేశ్ ది- పేర్ని నాని
” అర్ధరాత్రి చేసే పాదయాత్రకు యువగళం పేరు పెట్టారు. లోకేశ్ వయసు ఏంటి? అర్దరాత్రి నడక ఏంటి..? ఇది యువగళమా.. యువ గంగాలమా..? 10 కోట్లు ఖర్చుతో గన్నవరంలో సభ పెట్టి జగన్ ను, వైసీపీ నేతలను తిట్టారు. సంస్కారహీనంగా భూతులు తిట్టడం కోసమే లోకేశ్ పాదయాత్ర. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ టీడీపీ చెబుతున్న పథకాలు మేము అమలు చేస్తున్నవే. మా పథకాలు పేరు మార్చి ఇవ్వడానికి మళ్ళీ మీరు కావాలా..? 2014 నుండి 19 వరకూ ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా మోసం చేశారు. నేను మూర్ఖుడిని, కోసి కారం పెడతా, గుడ్డలు ఊడదీస్తా, కేసులు పెడతా.. ఇవే లోకేశ్ పథకాలు. తండ్రి ఫ్యామిలీ గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితి లోకేశ్ ది. (Perni Nani))

కొడాలి నాని అప్పుడు ఇస్రో శాస్త్రవేత్త కాదు కదా?
వంశీ, కొడాలి నాని మీ దగ్గర ఉన్నప్పుడు మంచి వాళ్లు.. ఇప్పుడు దుర్మార్గులు అయ్యారా..? లోకేశ్ కి దమ్ముంటే గుడివాడలో పోటీ చెయ్యాలి. NTR మనవడు అయితే పోటీ చెయ్యి. వాళ్ళని చూస్తే మీకెందుకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. రాజకీయంగా మిమల్ని గజగజలాడిస్తున్నాడని కించపరిచేలా మాట్లాడుతున్నారు. కొడాలి నాని టెన్త్ క్లాస్ చదువుకున్నాడు. టీడీపీలో ఉనప్పుడు కూడా టెన్త్ క్లాసే కదా. అప్పుడు ఇస్రో శాస్త్రవేత్త కాదు కదా..? కొడాలి నాని పై క్యాండిడేట్ ని పెట్టలేరు. కానీ, గుడ్డలూడదీస్తాను అంటున్నాడు. గన్నవరం, గుడివాడలో టీడీపీకి పోటీ చేసే మనుషులు లేరు. కబుర్లు గట్టిగా చెబుతున్నారు.

Also Read..Kesineni Brothers: లోకేశ్ పాదయాత్రకు దూరంగా అన్నయ్య.. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసిన తమ్ముడు!

లోకేశ్ పనికిరాడనేగా చంద్రబాబు పవన్ ను తెచ్చుకున్నారు..
లోకేశ్ పనికిరాడనేగా చంద్రబాబు వెళ్లి పవన్ ను తెచ్చుకున్నాడు. హెరిటేజ్ సరుకులు అమ్ముకోవడానికి టీడీపీ పథకాలు పెట్టింది. చంద్రన్న కానుకలు అంటూ హెరిటేజ్ సరుకులు అమ్మేశారు. వేసవి కాలంలో హెరిటేజ్ మజ్జిగ అమ్మేశారు. ఎన్నికల ముందు 50 అన్నా క్యాంటీన్లు పెట్టి హడావిడి చేశారు. 50 మందికి భోజనాలు పెట్టి 300 మందికి బిల్లులు పెట్టుకున్నారు” అని పేర్నినాని ధ్వజమెత్తారు.