Pension Kanuka : ఏపీలో పెరిగిన పింఛన్.. నేడే ప్రారంభం

ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.

Pension Kanuka : ఏపీలో పెరిగిన పింఛన్.. నేడే ప్రారంభం

Pension Kanuka

Updated On : January 1, 2022 / 8:12 AM IST

Pension Kanuka : ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.2,500 పెన్షన్ అందనుంది. వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు శనివారం నుంచి అమల్లోకి రానుంది.

చదవండి : CM Jagan Honor Kidambi Srikanth : రూ.7లక్షల నగదు, 5ఎకరాల భూమి.. శ్రీకాంత్‌కు సీఎం జగన్ ఘన సన్మానం

దీంతో పింఛను మొత్తం రూ.2,500 కానుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ దీన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1,570 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

చదవండి : CM Jagan : వారి ఖాతాల్లోకి రూ.703 కోట్లు.. ఏపీ ప్రభుత్వం తీపికబురు