TTD : టీటీడీ పాలకమండలిలో నేరచరితులు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో విచారణ

వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరికొన్ని పిటీషన్లలో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి, టీటీడీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

TTD : టీటీడీ పాలకమండలిలో నేరచరితులు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో విచారణ

Ap High Court

Updated On : April 19, 2022 / 4:48 PM IST

TTD Governing Body : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేరచరితులు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎంఎల్‌ఏ కరుణాకర్‌ రెడ్డితో పాటు తనను పాలకమండలి సమావేశానికి హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఎస్‌. సుధాకర్‌ హైకోర్టులో పిటీషన్‌ వేశారు.

వెంటనే ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మరికొన్ని పిటీషన్లలో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి, టీటీడీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పిటీషనర్ల తరపున న్యాయవాదులు ఆశ్వినీకుమార్‌, యలమంజుల బాలాజీ వాదించారు.

Tirumala : టీటీడీ సంచలన నిర్ణయం-టోకెన్ లేకుండానే శ్రీవారి దర్శనం

ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై ఉమ మహేశ్వర నాయుడు, పాలకవర్గంలో నేరచరితులపై బీజేపి నేత భాను ప్రకాష్‌ రెడ్డి పిటీషన్లు వేశారు. తుది వాదనలు వినేందుకు జూన్‌ 20వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.