జగన్‌పై దాడి కేసు : శ్రీనివాసరావు ఏం చెప్పాడు

  • Published By: chvmurthy ,Published On : January 14, 2019 / 03:29 PM IST
జగన్‌పై దాడి కేసు : శ్రీనివాసరావు ఏం చెప్పాడు

హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్‌పై దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. 7రోజుల పాటు నిందితుడు శ్రీనివాస్‌రావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు మాదాపూర్‌లోని NIA కార్యాలయంలో కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో జనవరి 13వ తేదీ ఆదివారం విచారణ ముగించారు. 3వ రోజు విచారణలో అనేక విషయాలపై NIA అధికారులు శ్రీనివాసరావును ఆరా తీసారు. దాడికి ప్రధాన కారణం, వెనుక ఎవరున్నారనే రెండు అంశాలతో విచారణ జరిపారు. కోర్టు ఆదేశాల మేరకు థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా ఎంక్వైరీ చేస్తున్నారు.

3 రోజులకు ఒకసారి వైధ్య పరీక్షలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలతో నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. NIA డీఐజీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక టీం నిందితుడిని ఎంక్వైరీ చేసి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. శ్రీనివాసరావు కాల్ డేటాను కూడా క్షుణ్ణంగా పరీశీలించారు. దాడి ఎందుకు చేశాడు, దాడి వెనుక ఎవరిదైనా ప్రోద్బలం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేశారు. 

జనవరి 15వ తేదీ సోమవారం మరోసారి సీన్ ఆఫ్ అఫెన్స్‌కు తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నట్లు నిందితుడు తరుఫు న్యాయవాదులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జగన్‌పై దాడి కేసులో NIA అధికారులు ఎలాంటి పురోగతి సాధిస్తారు? ఏడు రోజుల కస్టడీలో నిందితుడు శ్రీనివాసరావు అసలు నిజాలు చెప్తాడా? దీని వెనుక సూత్రధారులు ఎవ్వర? NIA బయటపెడుతుందా? లేదా ? అన్నది వేచి చూడాలి.