Fact Check : మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం.. వైరల్ వీడియో!

మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం సృష్టించింది. మత్స్సకారులకు జలకన్య చిక్కినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Fact Check : మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం.. వైరల్ వీడియో!

Jalakanya Fake Video Mypadu Beach Nellore

mypadu beach Fake Video : మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం సృష్టించింది. మత్స్సకారులకు జలకన్య చిక్కినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే మత్య్సకారులకు జలకన్య చిక్కినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు.

దీనిపై స్పందించిన ఆయన అదంతా ఫేక్ అని కొట్టిపారేశారు. అవన్నీ వదంతులేనని, వాటిని ఎవరూ నమ్మవద్దని అన్నారు. ఇందుకూరుపేటలో నరసింహులు మాట్లాడుతూ.. ఎవరో కావాలని ఒక వీడియోను  క్రియేట్ చేసి అది జలకన్య అంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోందని చెప్పారు.

వాస్తవానికి పది రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన జరిగినట్లు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసినట్టు గుర్తించామన్నారు. అయితే ఈ జలకన్య మైపాడు బీచ్‌లో చిక్కినట్టు కొన్ని రోజుల నుంచి ఈ వీడియోనలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారని అన్నారు. లేనివాటిని ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ఇలాంటి వీడియోలను పోస్టు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నరసింహులు అధికారులను కోరారు. గతంలోనూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనలు ఉన్నాయి.
Read Also :  Google Chrome : ఆండ్రాయిడ్ డివైజ్ క్రోమ్ బ్రౌజర్లలో కొత్త ప్రైవసీ ఫీచర్.. చెక్ చేశారా?