గోవింద..గోవింద : మంచుకొండల్లో శ్రీవారి ఆలయం

అవును మీరు వింటున్నది నిజమే. ఇక మంచుకొండల్లో శ్రీవారి నామస్మరణలు మారుమోగనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్టాల్లో ఉన్న ఏడుకొండల ఆలయం..ఇక జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఏర్పాటు కానుంది. ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతున్న సంగతి తెలిసిందే. తాజాగా 100 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
రెండేళ్లలోపు ఆలయాన్ని నిర్మించాలని టీడీపీ యోచిస్తోంది. తిరుమల నమూనాలో ఆలయాన్ని నిర్మించనున్నారు. మొత్తం 100 ఎకరాల స్థలంలో వేద పాఠశాల, వైద్య శాల, కళ్యాణ మండపం, ఆస్పత్రులను రెండేళ్లలోపు నిర్మించాలని భావిస్తున్నట్లు టీటీడీ బోర్డు ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. నిర్మాణానికి టీటీడీ బోర్డు కంట్యిబ్యూషన్‌తో పాటు భక్తుల నుంచి నిధులు సమీకరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం ఉందని, ఎలాంటి ముప్పు లేదన్నారు.
ఆలయ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేందుకు అనువైన స్థలాలను గుర్తిస్తామన్నారు. నీటి లభ్యంత, రవాణా సౌకర్యాలు ఇతరత్రా అనుకూలంగా ఉండే విధంగా స్థలాలను ఎంపిక చేస్తామన్నారు. జమ్మూలోని ధుమ్మి, మజిన్‌లోని స్థలాలు ఇందుకు అనుగుణంగా ఉన్నాయని సమాచారం.
* సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో టీటీడీ బోర్డు ప్రతినిధి బృందం జమ్మూ ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు జరిపింది.
* జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదా కల్పించడానికి ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
* రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు.
* అనంతరం జమ్మూలో పరిస్థితులు మారిపోయాయి.
* జమ్మూ కాశ్మీర్‌లో భూములు కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పించింది.
* ఈ క్రమంలో జమ్మూలో శ్రీనివాసుడు ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.
* కొద్ది రోజుల కిందట టీటీడీ కార్యనిర్వాహణాధికారి అనీల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు జమ్మూలో పర్యటించారు.
* దేశంలో పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాలున్నాయి.
* పరిపాలన, నిర్వాహణ, ఇతర వ్యవహారాలన్నింటినీ టీటీడీ స్వయంగా పర్యవేక్షిస్తుంటుంది.