వైసీపీకి ఓటు వేస్తే ప్రజల్ని యాచించే స్థాయికి దిగజారుస్తారు : పవన్
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు 10 రెట్లు పెరిగాయని మండిపడ్డారు.

Janasena Chief Pawan Kalyan Fires On Ycp
Pawan Kalyan fires on YCP : వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు 10 రెట్లు పెరిగాయని మండిపడ్డారు. ఎదురించే వారు లేకపోతే వైసీపీ దాష్టీకానికి అంతే ఉండదన్నారు. వైసీపీకి ఓటు వేస్తే ప్రజల్ని యాచించే స్థాయికి దిగజారుస్తారని చెప్పారు.
కుటిల రాజకీయాలు చేసిన వాళ్లు ఎంతో మంది మట్టికొట్టుకుపోయారని విమర్శించారు. వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. బెదిరింపులు..దాడులు…రక్తపాతం ఇదే వైసీపీ తీరు అన్నారు. వైసీపీ నేతలు బెదిరిస్తే.. తిరగబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ వీడియో సందేశం పంపారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే పార్టీ పెట్టానని తెలిపారు. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఆశీర్వదించండని అన్నారు.