Pawan Kalyan : కాపులు పార్టీ నడపలేరని విమర్శించే వారికి గట్టిగా సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్

ఇంత సంఖ్యా బలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ కోసం అడుక్కోవడం దేనికి..? అని పవన్ ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగ పడడం లేదన్నారు పవన్. కాపులు అధికారంలోకి వస్తే మిగిలిన కులాలను తొక్కేస్తారనే దుష్ప్రచారంతో నష్టం జరిగిందన్నారు.

Pawan Kalyan : కాపులు పార్టీ నడపలేరని విమర్శించే వారికి గట్టిగా సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్

Updated On : March 12, 2023 / 6:07 PM IST

Pawan Kalyan : కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులు పార్టీ నడపలేరనే విమర్శలు చేసే వారికి గట్టిగా సమాధానం చెప్పాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సంఖ్యా బలం ఎక్కువ ఉన్నా.. అధికారం చేజిక్కించుకోలేని కులాల్లో కాపు కులం ఉందన్నారు.

ఇంత సంఖ్యా బలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ కోసం అడుక్కోవడం దేనికి..? అని పవన్ ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగ పడడం లేదన్నారు పవన్. కాపులు అధికారంలోకి వస్తే మిగిలిన కులాలను తొక్కేస్తారనే దుష్ప్రచారంతో నష్టం జరిగిందన్నారు.

Also Read..Anantapur Lok Sabha constituency: పవన్ కల్యాణ్‌ను పోటికి దించుతారా.. కొత్త ముఖాలేమైనా బరిలోకి దిగబోతున్నాయా?

”కాపులు పెద్దన్న పాత్ర వహించాలి.. అప్పుడు ఊళ్లో ఏ కష్టం వచ్చినా కాపుల దగ్గరకే వస్తారు. ఇది అలవర్చుకుంటే అధికారం మీ దగ్గరకు వస్తుంది. సమాజంలో విడదీసే మనుషులే ఎక్కువే.. కలిపే వాళ్లు తక్కువ. 2009లో జరిగిన ఘటనలు నాలో పంతం పెంచాయి. సంఖ్యా బలం ఎక్కువ ఉన్న కులాల్లో ఐక్యత ఉండదని చాలామంది అన్నారు.

అధికారం చూడని ఏ కులం కూడా ఈ మాట పడకూడదు. దీని కోసం ఒక్కడు అన్ని అవమానాలు భరించాలి. త్యాగాలు చేయాలి. దీనికి నేను కంకణం కట్టుకున్నాను. నా తల్లి గాజుల బలిజ. మా నాన్న కాపు. నేనేంత వాస్తవమో.. నా కులం కూడా అంతే వాస్తవం. నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టొచ్చు. కానీ, నా మనస్సు అట్టడుగున ఉన్న రెల్లి కులం వైపే ఉంటుంది.

Also Read..Pawan Kalyan : కాపు-బీసీ కలిస్తే మనదే అధికారం, సగం పదవులు బీసీలకే- పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

కాపు నేతను కానేమో కానీ.. కాపుల సమస్యలను.. ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్న వాడిని. కాపులు పార్టీ నడపలేరనే విమర్శలు చేసే వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేనిదే రాజకీయం ఉండదు. దీన్ని ఎదుర్కొంటాను. నేను మెత్తగా కన్పిస్తానేమో కానీ.. మెత్తటి మనిషిని కాను” అని పవన్ కల్యాణ్ అన్నారు.