175 స్థానాల్లో పోటీ : పవన్ 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 10:27 AM IST
175 స్థానాల్లో పోటీ : పవన్ 

Updated On : January 6, 2019 / 10:27 AM IST

విజయవాడ : ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేన అధినేత, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కార్యకర్తలతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఉత్తరాంధ్ర వెనుకబాటుకు స్థానిక నాయకులే కారణమన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఓపిక, సహనం ఉండాలన్నారు. అవమానాలు తట్టుకునే శక్తి కార్యకర్తలకు ఉండాలని చెప్పారు.