Kiran Royal: ఏపీ హైకోర్టులో కిరణ్ రాయల్ లంచ్ మోషన్ పిటిషన్.. న్యాయస్థానం ఏ చెప్పిందంటే..
కిరణ్ రాయల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో

Kiran Royal
Kiran Royal: జనసేన నేత కిరణ్ రాయల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని కోర్టులో పిటిషన్ వేసిన కిరణ్ రాయల్.. అరుణేశ్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపేందుకు న్యాయస్థానం నిరాకరించింది. రేపు (బుధవారం) రెగ్యులర్ పిటిషన్ పై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని బాధితురాలు లక్ష్మీరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో ఆయనపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కిరణ్ రాయల్ తనను మోసంచేశాడని, తనను చంపేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.