Pawan Kalyan: టీడీపీ ఆఫీసులపై దాడులను తీవ్రంగా ఖండించిన జనసేనాని..!

ఏపీలో రాజకీయాలు మరింత వేడిక్కాయి. టీడీపీ ఆఫీసులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారి వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య దాడులతో భగ్గుమన్నాయి.

Pawan Kalyan: టీడీపీ ఆఫీసులపై దాడులను తీవ్రంగా ఖండించిన జనసేనాని..!

Janasena Pawan Kalyan Condemns Attack On Tdp Offices In Ap

Janasena Pawan Kalyan : ఏపీలో రాజకీయాలు మరింత వేడిక్కాయి. టీడీపీ ఆఫీసులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారి వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య దాడులతో భగ్గుమన్నాయి. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీడీపీ ఆఫీసులపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజాస్వామ దేశంలో ఇలాంటి దాడులు జరగడం మంచిది కాదని పవన్ అన్నారు. ఈ తరహా దాడులకు పాల్పడుతూ పోతే అరాచకాలకు దారి తీస్తాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
AP Bandh : రేపు రాష్ట్ర బంద్.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్

ఏపీలో జరిగిన దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడినవారిపై వెంటన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పవన్ కేంద్రాన్ని కోరారు. గుంటూరు జిల్లా మంగళిగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

పార్టీ కార్యాలయంలోని అద్దాలు, ఫర్నిచర్ సహా వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని నేతలపైనా కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు వైసీసీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ పై పట్టాభి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డారు.

డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ నేతలను పట్టాభి దుర్భాషలాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యలయం వద్ద వైసీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వైఎస్ జగన్‌పై అనుచిత వాఖ్యాలు చేసిన పట్టాభి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మహిళ కార్యకర్తలు చుట్టుముట్టారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు కార్యాలయానికి బయల్దేరారు. వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
YCP Workers Attack On TDP Office : ఏపీలో టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తల దాడి