JC Prabhakar Reddy: నీ భూమిలో నా వాళ్లు అడుగుపెట్టారు, ఫెన్సింగ్ పీకారు, చేతనైతే వచ్చి నన్ను కొట్టు- పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

ఈరోజుతో నువ్వు తాడిపత్రి వదిలి సంవత్సరం అయిందని ప్రజలు పండగ చేసుకున్నారు.

JC Prabhakar Reddy: నీ భూమిలో నా వాళ్లు అడుగుపెట్టారు, ఫెన్సింగ్ పీకారు, చేతనైతే వచ్చి నన్ను కొట్టు- పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

Updated On : May 14, 2025 / 4:24 PM IST

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. గతంలో అధికారం అడ్డం పెట్టుకుని పెద్దారెడ్డి ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆరోపించారు.

సోలార్ ఫ్యాక్టరీకి రైతులు ఇచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. గతంలో నీ భూమిలో అడుగు పెడితే నన్ను ఊరంతా తిప్పుతూ కొడతా అన్నావు.. ఇప్పుడు నీ భూమిలో నా వాళ్లు అడుగు పెట్టారు, నీ భూమి ఫెన్సింగ్ పీకారు, ఇప్పుడు చేతనైతే వచ్చి నన్ను కొట్టు అంటూ పెద్దారెడ్డిపై విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ”దేవుని సొమ్ము తిన్నావు, భూములను ఆక్రమించుకున్నావు. ఈరోజుతో నువ్వు తాడిపత్రి వదిలి సంవత్సరం అయిందని ప్రజలు పండగ చేసుకున్నారు. గతంలో సారా అమ్మిన చరిత్ర నీది” అంటూ పెద్దారెడ్డిపై ధ్వజమెత్తారు ప్రభాకర్ రెడ్డి.

Also Read: పెద్దిరెడ్డికి బిగ్ షాక్…! భూ ఆక్రమణల వ్యవహారంలో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..

ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా.. తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం ఆ హీట్ తగ్గలేదు. ఎన్నికల సమయంలో మొదలైన రాజకీయ రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వైసీపీ ఓటమి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి చెలరేగిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. అసలు నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా చేస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎలా అడుగు పెడతాడో చూస్తానంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.