ఏపీలో మరోసారి కాపు రిజర్వేషన్ అంశం.. తెరపైకి తెచ్చేది ముద్రగడ కాదు.. పవన్ కళ్యాణ్

ఏపీలో మరోసారి కాపు రిజర్వేషన్ అంశం..  తెరపైకి తెచ్చేది ముద్రగడ కాదు.. పవన్ కళ్యాణ్

Updated On : January 29, 2021 / 9:31 AM IST

Kapu reservation item once again in AP : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు కాక రేగబోతుందా..? కాపు అంశం మరిసారి ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ కాబోతుందా..? కాపు ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకున్నాక మరుగున పడిపోయిన రిజర్వేషన్ ఏపీలో మరోసారి తెరపైకి వస్తుందా..? అయితే ఈసారి ఈ అంశాన్ని తెచ్చేదేవరు..? ఓ పక్క స్థానిక సంస్థల హీట్ నడుస్తుంటే.. ఇప్పుడే కాపు ఇస్యూ ఎందుకు వస్తుంది..?

ఏపీలో కాపు రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. అయితే ఈసారి ఈ ఇష్యూను తెచ్చేది ముద్రగడ కాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు ఇష్యూ సద్దుమణిగింది. ఉద్యమాన్ని నడిపించిన ముద్రగడ తప్పుకోవడంతో కాపు రిజర్వేషన్ అంశం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఈ రిజర్వేషన్ అంశం తెరపైకి తెచ్చారు.

కొద్దిరోజుల క్రితమే మాజీ మంత్రి చేగుండి హరిరామజోగయ్య తనకు లేఖ రాసారని.. లేఖలో అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం అవుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చెప్పినట్టుగానే ఇవాళ మంగళగిరి పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్‌. కాపుల రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ నిధుల అంశంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర నలుములల నుండి కాపు సంఘాల నేతలు హాజరుకానున్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కపుల రిజర్వేషన్ల అంశం అంతగా బయటకి రాలేదు. అయితే తాజాగా ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ లేవనెత్తడం రాజకీయ వ్యూహమేనంటున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్రంలో బలమైన సామాజికవర్గం కావడంతో కాపుల ద్వారా పార్టీకి బలం పెంచుకోడానికి ఇష్యూని తెరపైకి తెచ్చారని టాక్ నడుస్తోంది.

అంతే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం పెంచుకోవడలో భాగమే అంటున్నారు. ఏదేమైనా ఏపీలో మరోసారి కాపు రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మరబోతుంది.. ఇవాళ్టి మీటింగ్‌లో పవన్ ఎలాంటి స్టాండ్ చెప్తారో చూడాలి.