Tirupati : కాటుక డబ్బాను మింగిన 9 నెలల బాలుడు..తర్వాత
డక్కలి మండలం ఎంబలూరులో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. రోహిత్ అనే 9 నెలల బాలుడు కాటుక డబ్బా మింగేశాడు.

Katuka
Katuka Box Stuck : చిన్న పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని అందరూ చెబుతుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చిన్నారుల ప్రాణాల మీదకు వస్తుంటాయి. గోలి, చాక్ పీస్, అన్నం మెతుకు, ఇడ్లీ, మాత్ర..ఇలా గొంతులో ఇరుక్కోవడంతో..కొంతమంది చిన్నారుల ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. అయితే..కొన్న సందర్భాల్లో..వైద్యులు శ్రమించి..ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడారు. చిన్న పిల్లల ఎదుట ఆట వస్తువులు, వారు తినే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు. తాజాగా..ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాటుక డబ్బాను 9 నెలలు బాలుడు మింగేశాడు. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read More : COVID-19 Effect: కొవిడ్ ఎఫెక్ట్.. వింత సమస్యతో రెండు నెలలుగా మలద్వారం..
నెల్లూరు జిల్లా డక్కలి మండలం ఎంబలూరులో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. రోహిత్ అనే 9 నెలల బాలుడు కాటుక డబ్బా మింగేశాడు. దీంతో శ్వాస ఆడక తీవ్ర ఇబ్బందులు పడిపోయాడు. ఇది తల్లిదండ్రులు చూశారు. ఏమైందోనని కంగారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరుపతి అంకుర ఆసుపత్రికి తరలించారు. ఓ పరీక్ష ద్వారా..స్వరపేటికలో కాటుక డబ్బా ఇరుక్కపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. అంకుర ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించారు. కాటుక డబ్బాను బయటకు తీయడంతో ఆ బాలుడు బతికిపోయాడు. ఈ సందర్భంగా తాము చికిత్స ఎలా నిర్వహించమనే దానిపై మీడియాకు వివరించారు డాక్టర్ వంశీకృష్ణ. కుమారుడిని కాపాడినందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు రోహిత్ తల్లిదండ్రులు.