తిరువూరు సభకు కేశినేని నానిని ఆహ్వానించాం: కేశినేని చిన్ని

తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై నిరసన గళం వినిపించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నానిని తిరువూరు సభకు ఆహ్వానించారు.

తిరువూరు సభకు కేశినేని నానిని ఆహ్వానించాం: కేశినేని చిన్ని

kesineni nani invited to chandrababu public meeting in tiruvuru

Updated On : January 6, 2024 / 2:17 PM IST

Kesineni Chinni : కృష్ణా జిల్లాలో రేపు తిరువూరులో జరిగే తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నానిని ఆహ్వానించామని ఆయన తమ్ముడు, టీడీపీ నేత కేశినేని చిన్ని తెలిపారు. శనివారం ఆయన 10 టీవీతో మాట్లాడుతూ.. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారని, ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు గౌరవిస్తామని.. మిగతా అంశాలు ఏవీ తనకు సంబంధం లేదన్నారు. కాగా, రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించడంతో టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ఇప్పటికే ప్రకటించారు. లోక్ సభ సభ్యత్వాన్ని కూడా వదులుకుంటానని కూడా తెలిపారు.

తిరువూరు సభకు లక్ష మంది
లక్ష మందితో తిరువూరు సభ హోరెత్తబోతోందని, జనసేన నుంచి కూడా భారీ ఎత్తున ఈ సభకు హాజరవుతున్నారని కేశినేని చిన్ని అన్నారు. ఎన్నికల సమయపిస్తున్న సమయంలో విజయవాడ పార్లమెంటు పరిధిలో తిరువూరులో జరిగే మొట్టమొదటి రాజకీయ బహిరంగ సభ ఇదని, తెలుగుదేశం జనసేన శ్రేణులు ఈ సభ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. తిరువూరు సభను విజయవంతం చేయాలని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలను కోరారు.