చంద్రబాబుతో దీనిపై చర్చకు నేను సిద్ధం: కేశినేని నాని

పవన్ కల్యాణ్‌ను చూస్తే నిజంగా జాలేస్తోందని కేశినేని నాని అన్నారు.

చంద్రబాబుతో దీనిపై చర్చకు నేను సిద్ధం: కేశినేని నాని

MP kesineni nani

సంక్షేమం పేరుని జపిస్తూ వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. చంద్రబాబు తన పాలనలో కనీసం రూ.100 కోట్లైనా విజయవాడకు ఇచ్చారా అని నిలదీశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది.

ఇందులో కేశినేని నాని మాట్లాడుతూ.. డ్రైనేజ్ వ్యవస్థ కోసం రూ.400 కోట్లు తెస్తే ఆ నిధులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని చెప్పారు. ఆ నిధులను తన పలుకుబడి ఉపయోగించే తెచ్చానని తెలిపారు. చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధమని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 33 వేల ఎకరాలు భూములను రైతుల నుంచి తీసుకున్నారని ఆరోపించారు.

తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు తప్ప ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు కట్టిందేంటని నిలదీశారు. తాను వైసీపీలోకి వచ్చాక 100కు పైగా సచివాలయాలు ప్రారంభించారని తెలిపారు. అమరావతి కోసం చంద్రబాబు నాయుడు రూ.3 వేల కోట్లైనా ఖర్చు చేశారా అని నిలదీశారు. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఐదేళ్ల క్రితం ఏం చేశారో.. ఈ ఐదేళ్లలో జగన్ ఏం చేశారో ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలకు ఆయన సూచించారు. అభివృద్ధి అంటే బిల్డింగులు, హోటళ్లు కాదని, మానవ అభివృద్ధే అసలైన అభివృద్ధి అని హితవు పలికారు. సామాన్యులను పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగన్‌దని అన్నారు. పవన్ కల్యాణ్‌ను చూస్తే నిజంగా జాలేస్తోందని అన్నారు.

ప్రతి మహిళకు కేజీ బంగారం, ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తానంటారు: మంత్రి పెద్దిరెడ్డి