చంద్రబాబు బస్సుయాత్రపై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం..
తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో ఈ కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేశారు పోలీసులు.

Chandrababu Convoy Attack Incident : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2022లో చంద్రబాబు నాయుడు బస్సు యాత్రపై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5న చంద్రబాబు బస్సు యాత్ర చేస్తుండగా.. నందిగామ చందర్లపాడు రోడ్డులో రాళ్ల దాడి ఘటన జరిగింది. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నందిగామలో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రూట్ లో వీధి లైట్లు ఆపి బస్సు యాత్రపై రాళ్ల దాడి చేశారు. ఆ ఘటనలో తృటిలో చంద్రబాబుకి ప్రమాదం తప్పింది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకి రాయి తగిలి గాయమైంది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. దీనిపై కేసు పెట్టినా.. అప్పటి వైసీపీ ప్రభుత్వం దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.
తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో ఈ కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేశారు పోలీసులు. తాజాగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతి రానా టాటా కీలక వ్యాఖ్యలు చేశారు. రాళ్ల దాడి జరగలేదని, చెట్టు కొమ్మలు తగలడంతో గాయాలయ్యాయని, కేసు నమోదు చేయలేదని వ్యాఖ్యానించారు. కాగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు దీనిపై చాలా సీరియస్ గా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల సూచనలతో కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. తాజాగా ప్రభుత్వం మారడంతో మళ్లీ ఆ కేసును విచారిస్తున్నారు పోలీసులు.
Also Read : వైసీపీకి రాం రాం.. వరుసగా పార్టీని వీడుతున్న నేతలు.. ఎందుకిలా, కారణం ఎవరు?