Amaravati ORR: ఇదే అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. గెజిట్ జారీ..

ఔటర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఏయే గ్రామాల మీదుగానో తెలుసా?

Amaravati ORR: ఇదే అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌.. కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. గెజిట్ జారీ..

Updated On : February 23, 2025 / 1:53 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్ నిర్మాణం కోసం కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని భారత్‌లోని జాతీయ రహదారులతో కలిపేలా నిర్మించేందుకు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. 189.9 కి.మీటర్ల పరిధిలో భూసేకరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు ఏలూరు, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పరిధిలో ఇవి ఉంటాయి. కేంద్ర సర్కారు భూ సేకరణ కోసం రాజపత్రాన్ని విడుదల చేసింది. ఇక జాతీయ రహదారుల సంస్థ తమ డివిజన్ల ప్రాతిపదికలో ఈ మేరకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాల వారీగా భూసేకరణకు కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇస్తారు.

Also Read: యూజీసీ నెట్‌ ఫలితాలు విడుదల.. కట్ ఆఫ్ పీడీఎఫ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఎన్‌హెచ్‌ఏఐ నుంచి వెళ్లిన ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులతో ఉండే ప్రతిపాదను, అలాగే, 2 లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల సిఫార్సులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆమోదం తెలుపుతుంది. అనంతరం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు తుది ఆమోదం కోసం పంపుతుంది. ఐదు జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం జరిగింది. 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా నిర్మాణం ఉంటుంది.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఈ గ్రామాల మీదుగా..

  • కృష్ణా జిల్లాలో 4 మండలాల పరిధిలో 24 గ్రామాలు
  • ఏలూరు జిల్లాలో ఒక మండలం పరిధిలో 11 గ్రామాలు
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 5 మండలాల పరిధిలో 28 గ్రామాలు
  • గుంటూరు జిల్లాలో 11 మండలాల పరిధిలో 46 గ్రామాలు
  • పల్నాడు జిల్లాలో రెండు మండలాల పరిధిలో 12 గ్రామాలు

ఓఆర్‌ఆర్‌లో కృష్ణానదిపై రానున్నవి ఇవే..

  • 2 బ్రిడ్జిలు
  • 34 చోట్ల హై ఓల్టేజీ క్రాసింగ్‌
  • టన్నెల్స్‌ 3
  • ఆర్‌ఓబీలు 7
  • అండర్‌ పాస్‌లు 78
  • చిన్న వంతెనలు 51
  • పెద్ద వంతెనలు 14
  • ఇంటర్‌ చేంజ్‌లు 9