Vallabhaneni Vamsi Arrest : వంశీ కేసులో లాయర్లకు జడ్జి కీలక ఆదేశాలు..

వంశీ కస్టడీ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలనే పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి.

Vallabhaneni Vamsi Arrest : వంశీ కేసులో లాయర్లకు జడ్జి కీలక ఆదేశాలు..

Updated On : February 19, 2025 / 8:16 PM IST

Vallabhaneni Vamsi Arrest : విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో తనకి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ లో తెలిపారు వంశీ. సీన్ రీ కన్ స్ట్రక్షన్ అవసరం లేదన్నారు. సత్యవర్ధన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు కాబట్టి ఎవరు దాడి చేశారు ఎక్కడ దాడి చేశారు అనేది సత్యవర్ధన్ చెబుతాడని అఫిడవిట్ లో పేర్కొన్నారు వంశీ.

మరోవైపు వంశీ పోలీస్ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. జైల్లో ప్రత్యేక వసతుల కోసం వంశీ దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ జరిపిన కోర్టు.. జైలు సూపరింటెండెంట్ కు నోటీసులు ఇవ్వాలని వంశీ తరపు లాయర్లకు జడ్జి ఆదేశించారు. జైలు సూపరింటెండెంట్ రిప్లయ్ ను బట్టి వసతుల కల్పనపై రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరారు.

Also Read : చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..

వంశీ కస్టడీ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలనే పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. బెయిల్ పిటిషన్ పైనా వాదనలు జరగాల్సి ఉండగా.. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు రోజుల సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిడి పడింది. వంశీని కస్టడీకి ఇస్తే మరికొన్ని విషయాలు బయటపడతాయని, వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

అయితే వంశీని విచారించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, వంశీకి సత్యవర్ధన్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవని, కావాలనే పోలీసులు కిడ్నాప్ కేసు క్రియేట్ చేశారని.. అందువల్ల వంశీని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వంశీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు.