ప్రధాని జోక్యం చేసుకోవాలి : లోక్ సభలో కియా రగడ

కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 08:07 AM IST
ప్రధాని జోక్యం చేసుకోవాలి : లోక్ సభలో కియా రగడ

Updated On : February 6, 2020 / 8:07 AM IST

కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు

కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు సంచలనం అయ్యాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ ప్రభుత్వం వైఖరి వల్లే కియా తరలిపోతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. కియా కార్ల పరిశ్రమ తరలింపు వార్తలను ప్రభుత్వం ఖండించింది. కియా ఎక్కడికీ వెళ్లదని ఏపీలోని ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది.

లోక్ సభలోనూ కియాపై గొడవ జరిగింది. టీడీపీ ఎంపీలు.. లోక్ సభలో కియా గురించి ప్రస్తావించారు. కియా తరలింపు వార్తలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వ విధానాలతో కంపెనీలు, పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రామ్మోహన్ నాయుడు ప్రసంగానికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడ్డు తగిలారు. కియా తరలింపు వార్తలను ఖండించారు. కియా కార్ల పరిశ్రమ తమిళనాడు తరలిపోతుందని వచ్చిన వార్తలు అవాస్తవం అని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కియా ఎండీతో తాను స్వయంగా మాట్లాడానని చెప్పారు. కియా తరలింపుపై వచ్చిన వార్తలను ఆ సంస్థ ఎండీ ఖండించారని మిథున్ రెడ్డి తెలిపారు. కియా మోటర్స్ ఎక్కడికీ పోవడం లేదని స్పష్టం చేశారాయన.    

కియా పరిశ్రమ తమిళనాడు తరలిపోతుందని వస్తున్న వార్తలను మంత్రి బుగ్గన ఖండించారు. ఆ వార్తలు అవాస్తవం అన్నారు. కియా పరిశ్రమ ఎక్కడికీ పోదని, ఏపీలోనే ఉంటుందని స్పష్టం చేశారు. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. కియా సంస్థకు ప్రభుత్వం పూర్తి సహకారం ఇచ్చిందన్నారు. కియా పరిశ్రమ నిర్వాహకులు చాలా సంతృప్తిగా ఉన్నారని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

కియా విషయంలో కావాలనే గందరగోళం సృష్టించారని, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు. కియా తరలింపుపై వార్తలను ఆ సంస్థే ఖండించిందని మంత్రి తెలిపారు. కియా పరిశ్రమ రూ.14వేల కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోందని చెప్పిన మంత్రి బుగ్గన.. అనవసర ప్రచారాలు చేసుకోవడం లేదన్నారు. ఏపీకి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండలో కియా కార్ల పరిశ్రమ ఉంది. టీడీపీ ప్రభుత్వం సమయంలో కార్ల పరిశ్రమను ఏర్పాటు చేసింది కియా. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కియా కార్ల పరిశ్రమ గురించి గొడవ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు కియా నిర్వాహకులను వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. తాజాగా కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు వెళ్లిపోతుందని రాయిటర్స్ రాసిన కథనంతో వివాదం మొదలైంది.