బైక్ కు చుట్టుకున్న కింగ్ కోబ్రా, చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్

King Cobra in Srikakulam : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద పోలేరు గ్రామంలో కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది. స్థానిక హనుమాన్ గుడి వద్ద మోటార్ బైక్‌కు చుట్టుకుంది. దీనిని చూసిన బైక్ యజమాని భయపడిపోయాడు. అసలు అక్కడకు ఎలా వచ్చిందో తెలియదు.
దీంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన కట్టె, బ్యాగుతో వచ్చిన స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకొనేందుకు ప్రయత్నించాడు. పొడుగుగా ఉన్న ఆ కోబ్రా తప్పించుకొనేందుకు ప్రయత్నించింది. ధైర్యంగా దాని తోకను పట్టుకున్నాడు. అటూ ఇటూ పరుగెత్తేందుకు ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఏ మాత్రం భయపడకుండా..చివరకు దాని మెడను కట్టె సహాయంతో పట్టుకుని..బ్యాగులో బంధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిని కొంతమంది తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆంతపెద్ద పామును చూడడం మొదటిసారి కావడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు.