నయా సాల్ జోష్ : ఏపీలో కింగ్ ఫిషర్, బడ్వైజర్ బీర్లు సేల్స్

Kingfisher and Budweiser beer : కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఎప్పటిలా..పాత బ్రాండ్లేనా…తాగడం, ఛ..అనుకుంటున్నారా ? పక్క రాష్ట్రంలోకి వెళ్లిపోదామా ? అని ఆలోచిస్తున్న వారు ఒక్కసారి ఆగండి. ఏపీలో కొద్ది రోజులుగా ఆగిపోయిన పాత బీర్ బ్రాండ్లను మరలా సేల్స్ చేయనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా..ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కింగ్ ఫిషర్, బడ్వైజర్ బీర్లు విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. తాత్కాలికంగా…ఒక్కో దుకాణంలో రోజుకు ఐదు కేసులు మాత్రమే సరఫరా చేయనున్నారు.
కరోనా, కొత్త రకం స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తుండడం, కొత్త సంవత్సరం రోజున మద్యం షాపులు బంద్ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ..అలాంటి నిర్ణయం తీసుకోలేదు జగన్ ప్రభుత్వం. సమయాల్లో మార్పులు చేయలేదు. మద్యం దుకాణాలు రాత్రి 9 గం..వరకు, బార్లు రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టత నివ్వడంతో మందుబాబులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఎప్పటిలాగానే..పాత బ్రాండ్లే తాగాలా అనుకున్నారు. నయా సాల్ జోష్ ఉండొద్దా ? ఆంధ్రా గోల్డ్, చుబుషూ బీర్..లాంటివి తెచ్చుకొనే పరిస్థితి ఉండేది. వర్జినల్ బ్రాండ్లు కావాలంటే..పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే..ప్రస్తుతం..ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసింది. పాత బ్రాండ్లను సేల్స్ చేయాలని నిర్ణయించడంతో మందుబాబులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.
– దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతుండడంతో విశాఖలో న్యూ యర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
– కరోనా దృష్ట్యా హోటళ్లు, పంక్షన్ హాళ్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఈ ఏడాది అనుమతి ఇవ్వడం లేదు.
– విశాఖలో ఈ ఏడాది ప్రజలంతా ఇళ్లకే పరిమితం కానున్నారు.
– బీచ్ రోడ్డులోకి వాహనాలకు, సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
– ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి ఎనిమిది గంటల వరకూ, బార్లు రాత్రి 11 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉండనున్నాయి.
– కరోనా నిబంధనల ప్రకారం అమ్మకాలు జరపాలని పోలీసులు ఆదేశించారు.
– 21 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్నవారికి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
– ప్రార్థనా మందిరాల్లో కూడా కరోనా నిబంధనలు అమలుచేయనున్నారు.