Kiran Royal: అందుకే టాలీవుడ్ నటీమణులు సైతం రోజాకు మద్దతు ఇవ్వలేదు?: జనసేన

రాధిక, ఖుష్బూకు అవగాహన లేకపోవడంతోనే మాట్లాడారని అన్నారు.

Kiran Royal: అందుకే టాలీవుడ్ నటీమణులు సైతం రోజాకు మద్దతు ఇవ్వలేదు?: జనసేన

Kiran Royal

Updated On : October 7, 2023 / 4:49 PM IST

Roja: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు కనీసం రాష్ట్ర మంత్రి వర్గంలోని మహిళా మంత్రుల మద్దతు లేదని జనసేన చెప్పింది. రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నటీమణులు రాధిక, ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

దీనిపై జనసేన నేత కిరణ్ రాయల్ తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రోజాకు మద్దతుగా మహిళా మంత్రులు ఇప్పటివరకు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆ మంత్రులకు రోజా గురించి తెలుసు కాబట్టి మాట్లాడలేదని చెప్పారు. రాధిక, ఖుష్బూకు అవగాహన లేకపోవడంతోనే మాట్లాడారని అన్నారు.

టీడీపీ నేతలపై, పవన్ కల్యాణ్ పై రోజా గతంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో, రాధిక తెలుసుకోవాలని చెప్పారు. కనీసం తెలుగు సినీ పరిశ్రమలోని మహిళా నటులు కూడా రోజాకు ఎందుకు మద్దతు తెలుపలేదో ఖుష్బూ, రాధిక గుర్తించాలని వ్యాఖ్యానించారు. కాగా, బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై రోజా మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.

Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్.. కేసీఆర్ ఆరోగ్యంపై డీకే అరుణ సంచలన కామెంట్స్