Kodali Nani : నీ DNA ఏంటో ముందు తెలుసుకో-చంద్రబాబు, లోకేశ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీమంత్రి కొడాలి నాని. మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. సీఎం జగన్ గురించి దారుణ పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి పిచ్చి పట్టినట్లు ఉందని, అందుకే సీఎం జగన్ ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా నీటితో నిండలేదన్నారు.(Kodali Nani)

Kodali Nani : నీ DNA ఏంటో ముందు తెలుసుకో-చంద్రబాబు, లోకేశ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

Updated On : February 17, 2023 / 6:27 PM IST

Kodali Nani : చంద్రబాబు, నారా లోకేశ్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీమంత్రి కొడాలి నాని. మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. సీఎం జగన్ గురించి దారుణ పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకి పిచ్చి పట్టినట్లు ఉందని, అందుకే సీఎం జగన్ ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా నీటితో నిండలేదన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి డీఎన్ఏ గురించి ప్రశ్నించేటప్పుడు నీ డీఎన్ఏ ఏంటో ముందు తెలుసుకోవాలని టీడీపీ నేత నారా లోకేశ్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. లోకేశ్ డీఎన్ఏ తెలంగాణ అని, ఏపీ వదిలి తెలంగాణలోనే ఆయన పోటీ చేయాలన్నారు. తాను బూతులు మాట్లాడతాను అనే వారికి లోకేశ్, చంద్రబాబు మాట్లాడే మాటలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు.(Kodali Nani)

Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

”తెలంగాణకు సంబంధించిన లోకేశ్ ఏపీలో తిరుగుతున్నాడు. రాయలసీమలో పుట్టిన పులి బిడ్డ జగన్ మోహన్ రెడ్డి. నువ్వు ఎక్కడ పుట్టావ్? నీ డీఎన్ఏ ఏంటి? నీ డీఎన్ఏ తెలంగాణ. నీ చరిత్రే అది. అందుకే నీకు ఇలాంటి అనుమానాలు వస్తాయి. తెలంగాణలో ఏదో ఒక నియోజకవర్గం చూసుకో. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి ఈ ప్రాంతం సంస్కృతి తెలియని నువ్వు అక్కడే ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసుకో” అని ఫైర్ అయ్యారు కొడాలి నాని.

Also Read..AP Early Elections : 75మంది తిరుగుబాటుకు సిద్ధం, నవంబర్‌లోపే ముందస్తు ఎన్నికలు..! అచ్చెన్న సంచలనం

”నువ్వు సైకోవి. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని దొంగిలించి, ఆయన పదవిని దొంగలించి, ఆయన ట్రస్టులను దొంగలించి, ఆ పార్టీకున్న డబ్బులను దొంగిలించి అనాథను చేసి ఒక ముసలాయనను చంపిన సైకో చంద్రబాబు. సైకోలకే సైకోవి నువ్వు. జగన్ ని సైకో అంటావా? చంద్రబాబు వెన్నుపోటు దారుడు, అవినీతి చక్రవర్తి అని మహానుభావుడు ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ ను చంపి ఆయన బొమ్మలను దండలు వేసి నీతి కబుర్లు చెబుతావా?” అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు కొడాలి నాని.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.