Minister Kodali Nani: భయపడి పారిపోయి.. ఎన్నికలను అడ్డుకుంటున్నారు

Minister Kodali Nani: భయపడి పారిపోయి.. ఎన్నికలను అడ్డుకుంటున్నారు

Kodali Nani Slams Tdp Over Parishat Elections

Updated On : April 6, 2021 / 5:09 PM IST

Minister Kodali Nani: పరిషత్ ఎన్నికలను హైకోర్టు వాయిదా వేయడంపై మంత్రి కొడాలి నానీ స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదు అనే ఉద్ధేశ్యంతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరగా.. ఎస్‌ఈసీ సానుకూలంగా నిర్ణయం తీసుకుందని అన్నారు.

అయితే, ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, జనసేనలు ఎన్నికలను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై, హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. హౌస్ మోషన్ పిటిషన్‌లో 21 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా మేం సిద్ధంగా ఉన్నామని కోడాలి చెప్పుకొచ్చారు.