Kodi Kathi Case : YS జగన్‌‌పై దాడిచేసిన ‘ఆకోడి కత్తి’ ఎక్కడుంది? కోర్టులో హాజరుపరచండీ : NIA కోర్టు ఆదేశం

YS జగన్‌ పై హత్యాయత్నం చేసినట్లుగా చెబుతున్న ఈ కోడి కత్తి ఎక్కడుంది? నేరానికి వినియోగించిన ఆ కత్తి ఎక్కడ? మా ముందుకు తీసుకురండీ అంటూ తాజాగా NIA కోర్టు ఆదేశించింది.

Kodi Kathi Case : YS జగన్‌‌పై దాడిచేసిన ‘ఆకోడి కత్తి’ ఎక్కడుంది? కోర్టులో హాజరుపరచండీ : NIA కోర్టు ఆదేశం

kodi kathi case

Updated On : March 7, 2023 / 6:17 PM IST

Kodi Kathi Case : YS జగన్‌ను పొడిచిన కత్తి ఎక్కడుంది? నేరానికి వినియోగించిన ఆ కత్తి ఎక్కడుంది. మా ముందుకు తీసుకురండీ అంటూ తాజాగా NIA కోర్టు ఆదేశించింది. ఈరోజు విజయవాడలో NIA కోర్టు కోడికత్తి కేసుకు సంబంధించి సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేశ్ కుమార్ ను కోర్టు విచారించింది. ఈ కేసులో నేరానికి వినియోగించిన ఆ కత్తి ఎక్కడుంది? అని ప్రశ్నించింది. తదుపరి విచారణ రోజున ఆ కత్తిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 14 (2023)కు వాయిదా వేసింది. 14న జరిగే విచారకు ఆ కత్తిని తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు కోర్టులో విచారణలు కొనసాగుతునే ఉన్నాయి. నిందితుడు జైలులోనే కాలం వెళ్లదీస్తున్నాడు. ఈకోడికత్తి కేసులో అసలు బాధితుడు అప్పటి ప్రతిపక్ష నేత..ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. నిందితుడు ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాకపోవటంపై ఎన్ ఐఏ కోర్టు అసహనం వ్యక్తంచేసింది. బాధితుడిగా భావిస్తున్న జగన్ కోర్టుకు రావాల్సిందేనని గతంలో స్పష్టంచేసింది. అయినా జగన్ కోర్టుకు హాజరుకాలేదు.

Kodi Kathi Case : కోడి కత్తి కేసులో NIA కోర్టు సంచలన వ్యాఖ్యలు .. జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందే,అప్పుడే విచారిస్తామన్న కోర్టు

ఈక్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం(NIA)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఇవ్వాళ విచారణ కొనసాగుతున్న సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ ఘటనలో బాధితుడు న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది.

2018లో విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై శ్రీనివాస రావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఈ కేసు అప్పటినుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది. అలాగే నిందితుడు శ్రీనివాస రావు తల్లిదండ్రులు జగన్ చుట్టు తిరుగుతున్నారు. తమ కుమారుడికి బెయిల్ ఇప్పించటానికిసహకరించాలని కోరుతున్నారు. కానీ జగన్ మాత్రం కనీసం బాధిత కుటుంబ సభ్యులకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటంలేదు. దీంతో వారు తమ కుమారుడి జీవితం అంతా జైల్లోనే గడిచిపోతోందని వాపోతున్నారు.

kodi kathi case : ‘కోడి కత్తి’ కుటుంబానికి దొరకని జగన్ అపాయింట్ మెంట్ .. 7సార్లు పిటిషన్ వేసినా బెయిల్ ఎందుకు రావడంలేదోనంటూ వాపోయిన నిందితుడి కుటుంబం