ఐదేళ్లుగా నా కొడుకు జైల్లో ఉన్నాడు.. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు: కోడికత్తి నిందితుడి తల్లి
తన కొడుకు జనుపల్లి శ్రీనివాస్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ సావిత్రమ్మ కన్నీరు పెట్టుకున్నారు.

Kodikathi Srinu Family
Kodi Katti Case: ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లి శ్రీనివాస్ ను జైలు నుంచి విడుదల చేయాలని అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. తన కొడుకు జనుపల్లి శ్రీనివాస్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ సావిత్రమ్మ కన్నీరు పెట్టుకున్నారు.
‘ఐదేళ్లుగా నా కొడుకు జైల్లో ఉన్నాడు.. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. లేకుంటే ఎన్ఓసి ఇచ్చి కేసు ఉపసంహరించుకోవాలి. రేపటి నుంచి జైలులో నా కొడుకు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నాడు’ అని సావిత్రమ్మ అన్నారు.
జనుపల్లి శ్రీనివాస్ అన్న సుబ్బరాజు మాట్లాడుతూ… ‘నా సోదరుడు శ్రీనివాస్‌ను అడ్డుపెట్టుకుని జగన్ ఎన్నికల్లో లబ్ధిపొంది సీఎం అయ్యారు. దళితుడు అనే కారణంతో జనుపల్లి శ్రీనివాస్‌పై అందరూ వివక్ష చూపుతున్నారు. నా సోదరుడిని జైలు నుంచి విడుదల చేయకుంటే మేము రేపు దుర్గ టెంపుల్‌కు వెళ్లి దర్శనం చేసుకొని వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.
ఎక్కడ నిరాహార దీక్ష చేసేది తరువాత చెబుతాం. అన్ని చెబితే.. పోలీసులు మమ్మల్ని బయటకి వెళ్లనివ్వరు. నిరాహార దీక్ష చేయనివ్వరు. మా తమ్ముడికి ఏం జరిగినా బాధ్యత సీఎం జగన్‌దే. మొదట సిట్ ఆఫీసర్లు మా ఇంటికి వచ్చి విచారించారు. మా సోదరుడు కోడి కత్తితో జగన్‌పై దాడి చేయలేదు. మా సోదరుడు జగన్ అభిమానే. ఆ అభిమానమే మాకు శాపంగా మారింది’ అని అన్నారు.
Rajinikanth : తలైవా అభిమానులపై విరుచుపడిన పెద్దావిడ.. రజినీకాంత్‌పై కూడా..