ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులైన ప్రతి మహిళకు అందిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.

Kollu Ravindra
ప్రతి ఆడ బిడ్డ ముఖంలో వెలుగులు నింపేలా దీపావళి నాడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్లను అర్హులైన ప్రతి మహిళకు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలెండర్ల కోసం బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. రేపు ఉదయం 10 గంటలకు అన్ని ప్రాంతాలలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు గుంటలమయం అయ్యాయని విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో గుంతలమయమైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.250కోట్లు మంజూరు చేసినట్టు కొల్లు రవీంద్ర తెలిపారు. చిన్న, పెద్ద అందరూ సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ దీపావళి అని చెప్పారు. చెడుపై మంచి గెలిచిన రోజు, నరకాసురుడి వద జరిగిన రోజని తెలిపారు.
ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని జరుపుకునే పండుగ దీపావళని కొల్లు రవీంద్ర అన్నారు. 250 కోట్ల రూపాయల ఖర్చుతో రహదారుల గుంటలను పూడ్చే కార్యక్రమాన్ని నవంబర్ 2న చేపడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల దరఖాస్తులు మద్యం షాపులకు వచ్చాయని వివరించారు.
వివాదాలతో వైసీపీలో కలకలం.. ఫ్యామిలీ పాలిటిక్స్.. పార్టీని దెబ్బతీస్తున్నాయా?