వివాదాలతో వైసీపీలో కలకలం.. ఫ్యామిలీ పాలిటిక్స్‌.. పార్టీని దెబ్బతీస్తున్నాయా?

కోర్టులకు వెళ్లడంలాంటి వ్యవహారంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందని.. దీంతో పార్టీకి నైతికంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని టాక్‌.

వివాదాలతో వైసీపీలో కలకలం.. ఫ్యామిలీ పాలిటిక్స్‌.. పార్టీని దెబ్బతీస్తున్నాయా?

Updated On : October 31, 2024 / 2:40 PM IST

ప్రపంచంలో గొప్పగొప్ప యుద్ధాలు మన అనుకున్న వాళ్లతోనే ! వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఇలానే ఉంది ఇప్పుడు ! అధికారం పోయినా.. జనం తరఫున చంద్రబాబు మీద యుద్ధం చేద్దాం అనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. కుటుంబంలో, కుటుంబంతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులను టెన్షన్ పెట్టిస్తోంది. జగన్ సార్.. ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టండి అంటున్నారు. ఇంతకీ వాళ్లు అంటుందేంటి.. అంత ఆవేదన ఎందుకు.. వాచ్ దిస్‌..

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఆస్తుల వ్యవహారంలో షర్మిల ఘాటు ఆరోపణలు చేయగా.. వాటిని సమహ్ధిస్తూ.. జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రకటనలు అన్నీ అసత్యాలని.. తల్లి విజయమ్మ ఓ లేఖ రిలీజ్ చేశారు. ఇది వైసీపీలో, ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆస్తుల వివాదంలో అసలేం జరిగిందో.. ఏం జరగాలో అన్నీ చెప్పుకొచ్చారు ఆ లెటర్‌లో విజయమ్మ. అన్యాయం జరుగుతోందనే.. తను షర్మిలవైపు ఉన్నానని చెప్పారు.

విజయమ్మ ఏం చెప్పారు?
ఆస్తుల విషయంలో షర్మిలకు జగన్ అన్యాయం చేస్తున్నారన్నట్లుగా లేఖలో విజయమ్మ చెప్పినట్లు అనిపించింది. ఇదే విషయం జనాల్లోకి వెళ్లిపోయింది. ఇదే వైసీపీ శ్రేణులను మరింత టెన్షన్ పెడుతోంది. తన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని.. జరుగుతున్న సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని.. ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి కళ్ల ముందే జరిగిపోతున్నాయని.. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ బతికుండగానే ఆస్తులు పంచారనడంలో ఎలాంటి నిజం లేదని.. కొన్ని ఆస్తులు షర్మిల పేరుతో.. మరికొన్ని ఆస్తులు జగన్‌ పేరుతో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. నలుగురు చిన్న పిల్లలకు సమానంగా వాటా ఉండాలన్నది వైఎస్ ఆజ్ఞ అని విజయమ్మ లేఖలో తెలిపారు. ఆస్తుల వృద్ధిలో జగన్‌ కష్టం ఉందనేది నిజమే అని.. అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అని లేఖలో రాసుకొచ్చారు.

విజ‌య‌మ్మ బ‌హిరంగ లేఖ‌కు వైసీపీ కౌంట‌ర్ ఇచ్చింది. నిజమైన బాధితుడు జగనే అని.. కోర్టు కేసుల‌తో ఆయన పోరాడుతున్నార‌ని.. దాని ఫ‌లితాల‌పై స్పృహ లేకుండా ష‌ర్మిల ప్రవ‌ర్తిస్తున్నార‌ని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది. విజ‌య‌మ్మ లేఖ‌లో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం సాగిస్తున్న కుట్రల గురించి ఎందుకు ప్రస్తావించ‌లేద‌ని ఆ పార్టీ ప్రశ్నించింది. విజ‌య‌మ్మచెప్తున్నట్లు నిజంగా ఆస్తుల పంప‌కం జరగకుంటే.. హ‌క్కుగా రావాల్సి ఉంటే.. ఎంవోయూ ఎందుకు రాసుకుంటార‌ని ప్రశ్నించింది. అసలు అవి కుటుంబ ఆస్తులు కానే కావ‌ని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్తుల వ్యవహారం కోర్టులో ఉందని.. రెండు వైపుల వాదనలు జనాల ముందు ఉన్నాయని వైసీపీ తెలిపింది. అమ్మ లేఖ రాశారు.. కొడుకు పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఇక్కడివరకు అంతా బానే ఉంది. ఈ లేఖల యుద్ధం జనాల్లోకి వెళ్తున్న తీరుతో.. వైసీపీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైనట్లు కనిపిస్తోంది.

నిజానికి ఆస్తుల వ్యవహారం అనేది వైఎస్ కుటుంబం వ్యక్తిగతం. ఇంట్లో కూర్చొని పంచాయితీ తేల్చుకంటే.. అసలు రచ్చ జరిగేదే కాదు. ఐతే షర్మిల ఆస్తుల వ్యాఖ్యలు చేయడం.. జగన్ కోర్టుకెక్కడం.. ఇప్పుడు విజయమ్మ లేఖ రాయడం.. ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది హాట్‌టాపిక్‌ అవుతోంది. వీళ్ల కుటుంబం వివాదంతో.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని.. వైసీపీ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారని టాక్. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందే.. షర్మిల ఎఫెక్ట్‌ వైసీపీ మీద భారీగా పడిందనే ప్రచారం ఉంది.

కుటుంబంలో జరిగిన పరిణామాలే వీటికి కారణం?
బాబాయ్ హత్య కేసు.. ట్రోలింగ్ వ్యవహారంలో జగన్‌ను టార్గెట్‌ చేస్తూ షర్మిల కన్నీళ్లు పెట్టుకోవడం.. ఆ తర్వాత ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు.. విజయమ్మ వీడియో విడుదల చేసి.. షర్మిలకు ఓటు వేయండి అని అడగడం.. ఎన్నికల్లో చాలా ఎఫెక్ట్ చూపించింది. కంచుకోటలాంటి సీమ జిల్లాల్లోనూ వైసీపీ పట్టు సాధించలేకపోయింది అంటే.. వైఎస్‌ కుటుంబంలో జరిగిన పరిణామాలే కారణం అనే చర్చ ఉంది. ఇప్పుడు ఆస్తుల వివాదంతో మళ్లీ అలాంటి పరిస్థితే వస్తుందా అనే భయాలు వైసీపీ నేతల్లో కనిపిస్తున్నాయ్.

కుటుంబ ఆస్తి వివాదాలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని.. వైసీపీ నేతల లోలోపల మదనపడుతున్నారట. పైకి ఏదో చేసుకుంటున్నాయ్‌.. ఇన్‌సైడ్‌ మాత్రం తెగ కంగారు పడిపోతున్నాట. ఎన్నికల ముందు రోజులను గుర్తు చేసుకొని మరీ భయపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తల్లి, చెల్లిపై జగన్‌ వివాదాలతో.. మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందంటున్న కేడర్ భావిస్తోంది.

కోర్టులకు వెళ్లడంలాంటి వ్యవహారంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందని.. దీంతో పార్టీకి నైతికంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని టాక్‌. మరికొందరయితే.. ఈ వ్యవహారానికి జగన్ ఎప్పుడో ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందని.. ఇక్కడివరకు తీసుకొచ్చి మరింత కాంప్లికేట్‌ చేసుకున్నారని అంటున్నారని తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు తల్లి విడుదల చేసిన లేఖలపై జగన్‌ రియాక్ట్ అవుతారా లేదా.. తల్లి మాట వింటారా లేదా అని.. ఏపీ రాజకీయం అంతా ఆసక్తిగా గమనిస్తోంది.

మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన కూటమి సర్కార్‌.. గ్రౌండ్‌ లెవల్‌లో వైసీపీ బాగోతాలపై ఫోకస్‌..