Varikuti Ashok Babu : సాయంత్రం పూట ఎవరైనా పాదయాత్ర చేస్తారా? ఎలా ముందుకెళ్తారో చూస్తా? నారా లోకేశ్‌కు వైసీపీ నేత వార్నింగ్

మా పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు చేస్తే సహించం. (Varikuti Ashok Babu)

Varikuti Ashok Babu : సాయంత్రం పూట ఎవరైనా పాదయాత్ర చేస్తారా? ఎలా ముందుకెళ్తారో చూస్తా? నారా లోకేశ్‌కు వైసీపీ నేత వార్నింగ్

Varikuti Ashok Babu(Photo : Google)

Updated On : July 18, 2023 / 9:46 PM IST

Varikuti Ashok Babu – Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రపై ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు ఫైర్ అయ్యారు. లోకేశ్ పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. అసలు సాయంత్రం 4 గంటల సమయంలో ఏ దిక్కుమాలినోడైనా పాదయాత్ర చేస్తారా? అని నిలదీశారు. రాత్రుల్లో పొలాలు, నివాసాలు, ముఖాలు, ప్రజల జీవన విధానం ఎలా తెలుస్తుంది అని లోకేశ్ ను ప్రశ్నించారు వరికూటి అశోక్ బాబు. జగన్ పాద యాత్ర జన సునామీ అయితే, లోకేశ్ పాదయాత్ర 150మంది కూలీలను కూలీకి తెచ్చి నడిపిస్తున్న పాదయాత్రలా ఉందని విమర్శించారు.

Also Read..Janasena Party: జంపింగ్‌లకు ప్రత్యామ్నాయంగా జనసేన.. వారాహి యాత్రతో పవన్ పార్టీలో జోష్!

”మర్రిపూడి మండలం అగ్రహారం గ్రామంలో కొమ్ము కోటమ్మ అనే దళిత మహిళ తన బడ్డి బంకు ఎదురుగా టీడీపీ జెండా స్థూపాన్ని నిర్మించారని, తనకు ఇబ్బందిగా ఉందంటూ స్థానిక వైసీపీ నేతల దృష్టికి తీసుకొచ్చింది. వారీ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. దిమ్మె తొలిగించేందుకు ఘటనా స్థలానికి వెళ్తుంటే పోలీసులు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు.

మా పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు చేస్తే సహించం. జెండాను పూర్తిగా తొలగించే వరకు ఇక్కడే కూర్చుంటాను. వెళ్లే ప్రసక్తే లేదు. గతంలో ఉన్న స్థూపం తొలిగించి జెండా స్థూపాన్ని నిర్మించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి. లోకేశ్ పాదయాత్ర దగ్గరికి వెళ్లొద్దని పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర దగ్గరకి నన్ను పంపకపోతే అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసనకు దిగుతా. ఆ స్థూపాన్ని వెంటనే టీడీపీ నేతలు తొలగించి క్లియర్ చేయకపోతే యువగళం పాదయాత్ర ఎలా ముందుకు వెళ్తుందో చూస్తా” అని వరికూటి అశోక్ బాబు హెచ్చరించారు.

Also Read..Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్.. అంతేకాదు..