Anjaneyulu: మాకు ప్రాణహాని ఉంది.. ఏదైనా జరిగితే అందుకు కారణం బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డే

సుమారు 18సంవత్సరాల పాటు కుండా భాస్కర్ రెడ్డి పీఏగా తోట ఆంజనేయులు పనిచేశాడు. విశాఖపట్నంలో ఉంటూ భాస్కరెడ్డి వ్యాపార, ఇతర లావాదేవీల వ్యవహారాలు ఆంజనేయులు చక్కబెడుతుండేవాడు. గత ఐదు నెలల క్రితం ఆంజనేయులు కుండా భాస్కర్ రెడ్డి వద్ద జాబు మానేశాడు.

Anjaneyulu: మాకు ప్రాణహాని ఉంది.. ఏదైనా జరిగితే అందుకు కారణం బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డే

balineni srinivasa reddy

Updated On : May 23, 2023 / 12:38 PM IST

Tota Anjaneyulu: మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి మాజీ పీఏ తోటా ఆంజనేయులును మరోసారి ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌కు పిలిపించి అర్దరాత్రి 1:30గంటల వరకు తాలూక పోలీస్టేషన్లో కూర్చోబెట్టినట్లు ఆంజనేయులు, అతని భార్య పద్మజ ఆరోపించారు. ఆంజనేయులు‌కు తోడు‌గా స్టేషన్‌కు వెళ్లగా.. తనను పోలీస్టేషన్ బయట నిల్చోబెట్టినట్లు పద్మజ తెలిపింది. తమపై ఫిర్యాదు చేసిన నరేష్ అనే అతనికి తమకు మధ్య ఎటువంటి భూ కొనుగోళ్లు జరగలేదని, ఆయనను నేను ఏదో మోసం చేశానంటూ తప్పుడు కేసులు బనాయించారని తోట ఆంజనేయులు, అతని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి‌ నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఇదే విషయంపై తాము హైకోర్టు‌ను కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. తమవద్ద ఫ్యాక్సనిస్టులు ఉన్నారని వారు మీ అంతు చూస్తారని, మీ కుమారుడు ఎక్కడ చదువు తున్నాడో మాకు తెలుసని, పోలీసులు మా మాటే వింటారు అంటూ గతంలో బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి తమను హెచ్చరించారని ఆంజనేయులు, అతని భార్య పద్మజ వాపోయారు.

Prakasam District: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడి మాజీ పీఏను అరెస్టు చేసిన పోలీసులు

సుమారు 18సంవత్సరాల పాటు కుండా భాస్కర్ రెడ్డి పీఏగా తోట ఆంజనేయులు పనిచేశాడు. విశాఖపట్నంలో ఉంటూ భాస్కరెడ్డి వ్యాపార, ఇతర లావాదేవీల వ్యవహారాలు ఆంజనేయులు చక్కబెడుతుండేవాడు. గత ఐదు నెలల క్రితం ఆంజనేయులు కుండా భాస్కర్ రెడ్డి వద్ద జాబు మానేశాడు. ఇటీవల బాలినేనితోపాటు ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డిపై పలు భూ అక్రమాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసింది.. విశాఖ పట్నం‌కు చెందిన జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్. అతని ఆరోపణల వెనుక ఆంజనేయులు పాత్ర ఉందని భాస్కర్ రెడ్డి వర్గీయులు అనుమానిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల నరేష్ అనే వ్యక్తి ఆంజనేయులు‌పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. సోమవారం తన స్వగ్రామం సంతనూతలపాడు మండలం ఎడ్లూరుపాడులో ఆతని తల్లి సీతమ్మ పెద్దకర్మ కార్యక్రమం ముగించుకోని ఒంగోలుకు వెలుతుండగా ఎడ్లూరుపాడు డొంక వద్ద పోలీసులు మఫ్టీలో వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. మద్దిపాడు పోలీస్టేషన్‌కు తరలించి అనంతరం రాత్రి సమయంలో వదిలేశారు.  ఫోర్జరీ కేసు విచారణ‌లో భాగంగా అతన్ని పోలీస్టేషన్‌కు రప్పించామని ఇందులో రాజకీయ నాయకులకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు.

Balineni Srinivasa Reddy : పంతం నెగ్గించుకున్న బాలినేని శ్రీనివాస రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

వయస్సు మీద పడ్డ దృష్ట్యా పనిఒత్తిడి తట్టుకోలేక భాస్కర్ రెడ్డి వద్ద జాబు మానేయగా, మానేయడానికి వీలులేదంటూ తన భర్తపై భాస్కర్ రెడ్డి వత్తిడి తెచ్చాడని పద్మజ తెలిపింది. విశాఖ పట్నంకు చెందిన జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్‌కు తమ లే అవుట్‌కు సంబంధించిన భూమి వివరాల సమాచారాన్ని తోట ఆంజనేయులే వారికి ఇచ్ఛి ఉంటాడని బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. అయితే, వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఆంజనేయులు భార్య తెలిపింది. వైజాగ్‌లోని తమ నివాస పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఎక్కువవ్వడం, తమ నివాసంపై ఫోకస్ లైట్స్ వేస్తుండటంతో పాటు పోలీసులు సమయం సందర్భం లేకుండా తమ నివాసాల వద్దకు వస్తుండటం‌పై తాము భయాందోళన చెందుతున్నామని ఆంజనేయులు, అతని భార్య పద్మజ వాపోయారు. తమకు ఎవ్వరితోనూ ఎటువంటి గొడవలు లేవని, తమకు ఏదైనా జరిగిందంటే దానికి కారణం బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డే కారణమని ఆంజనేయులు భార్య పద్మజ చెప్పారు.