కర్నూలులో కరోనాతో ప్రముఖ డాక్టర్ మృతి, ఆందోళనలో రెండు జిల్లాల రోగులు

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్‌ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో

  • Published By: veegamteam ,Published On : April 16, 2020 / 06:00 AM IST
కర్నూలులో కరోనాతో ప్రముఖ డాక్టర్ మృతి, ఆందోళనలో రెండు జిల్లాల రోగులు

Updated On : April 16, 2020 / 6:00 AM IST

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్‌ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్‌ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. డాక్టర్ కు కరోనా ఉందని తేలడం రోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంద. రెండు జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేసింది. చాలా మంది రోగులు ఆ వైద్యుడి దగ్గర చికిత్స చేయించుకున్నారు. వైద్యుడి దగ్గరికి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల నుంచి రోగులు వెళ్లారు. ఇప్పుడా డాక్టర్ కి కరోనా అని తెలియడంతో ఆయన దగ్గర చికిత్స పొందిన రోగుల్లో ఆందోళన నెలకొంది. డాక్టర్ మృతితో అధికారులు అలర్ట్ అయ్యారు. వైద్యుడిని ఎవరెవరు సంప్రదించారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వారి వివరాలు సేకరిస్తున్నారు.

ఆ తేదీల్లో కేఎం ఆసుపత్రికి వెళ్లిన వారంతా స్వచ్చందంగా వివరాలు తెలపాలన్న కలెక్టర్:
డాక్టర్ కు కరోనా ఉందని నిర్ధారణ కావడంతో ఆయన ఆసుపత్రిలో పని చేసే వారితో పాటు డాక్టర్ కుటుంబసభ్యులను అధికారులు క్వారంటైన్ కు తరలించారు. డాక్టర్ దగ్గరికి వందల సంఖ్యలో రోగులు వచ్చినట్లు గుర్తించారు. కర్నూలు కేఎం ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారితో పాటు ఆసుపత్రి సిబ్బందిని కలిసిన వారి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు కేఎం ఆసుపత్రికి వెళ్లిన వారంతా స్వచ్చందంగా సమాచారం ఇవ్వాలని కలెక్టర్ కోరారు.
 

తెలంగాణలో 650, ఏపీలో 514 కరోనా కేసులు:
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఏపీలో రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 650 మంది కరోనా బారినపడ్డారు. యాక్టివ్ కేసులు 514. ఇప్పటివరకు కరోనాతో 18మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 118మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 525మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 14మంది కరోనాతో చనిపోయారు. 20మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Also Read | చైనా నుంచి భారత్ కు : మరికొద్దిసేపట్లో ఢిల్లీకి 6.5లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్

ప్రపంచవ్యాప్తంగా 20.82లక్షలు, దేశంలో 12వేల 300 కరోనా కేసులు:
దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 12వేల 300కి చేరింది. దేశవ్యాప్తంగా 424మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 1,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా బాధితుల సంఖ్య 20లక్షల 82వేలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 34వేల మంది కరోనాకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 14లక్షల 30వేలు. అన్ని దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5.8లక్షలు. 

అమెరికాలో 6.44లక్షలకు చేరిన కరోనా కేసులు, 28వేల 383 మరణాలు:
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6లక్షల 44వేలకు చేరింది. నిన్న(ఏప్రిల్ 15,2020) కొత్తగా 27వేల 413 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 28వేల 383మంది చనిపోయారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 2వేల 336మంది మరణించారు. న్యూయార్క్ నగరంలో గత 24 గంటల్లో 752మంది మృత్యువాతపడ్డారు.