టీడీపీ మోసం చేసింది..తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2019 / 01:54 PM IST
టీడీపీ మోసం చేసింది..తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక

Updated On : March 16, 2019 / 1:54 PM IST

కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక ఆ తర్వాత టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు మళ్లీ ఆమె తిరిగి పొంతగూటికి చేరుకున్నారు.
Read Also : పోత్తుల్లో భాగంగా పవన్ కీలక భేటీ.. క్లారిటీ వచ్చేస్తుంది

వైసీపీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ ఐదేళ్లలో రెండు పార్టీలలో తాను చాలా అనుభవం పొందినట్లు తెలిపారు. టీడీపీ,వైసీలో ఉన్న వ్యత్యాసాన్ని చూసి తాను మళ్లీ వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఎలాంటి షరతులు తేకుండా తాను చేరినట్లు వచ్చినట్లు తెలిపారు. వైసీపీ పార్టీ మీద ఉన్న గౌరవంతో తిరిగి పార్టీలో చేరినట్లు తెలిపారు. ఓ బీసీ మహిళను అయిన తనను టీడీపీ మోసం చేసిందన్నారు.

టీడీపీలోకి వెళ్లిన తర్వాత  దాదాపు ఏడాదిన్నరపాటు తాను చాలా భాధపడినట్లు తెలిపారు.టీడీపీలో కనీస గౌరవం లేదన్నారు. టీడీపీ తమది బీసీ పార్టీ అని చెబుతూ అగ్రకులాలకే సీట్లు ఇస్తుందన్నారు. వైసీపీలోకి రావడం తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుందన్నారు. వైసీపీని గెలిపించేందుకు తన శక్తిమేరకు పనిచేయనున్నట్లు తెలిపారు. టీడీపీలో మెంటల్ టార్చర్ అనుభవించినట్లు తెలిపారు.