కానిస్టేబుల్ తో లేడీ ఎస్సై ప్రేమాయణం…రచ్చకీడ్చిన పోలీస్ భార్య

కానిస్టేబుల్ తో లేడీ ఎస్సై ప్రేమాయణం…రచ్చకీడ్చిన పోలీస్ భార్య

Updated On : December 19, 2020 / 2:06 PM IST

Lady SI fell in love with a constable :  నెల్లూరు జిల్లాలో కానిస్టేబుల్ తో ఓ లేడీ ఎస్సై జరుపుతున్న ప్రేమాయణం ఇప్పుడం సంచలనంగా మారింది. చివరికి ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో దిశ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న ఆ లేడీ ఎ్ససైని వీఆర్ కు పంపించారు. ఎస్సై వీఆర్ కు వెళ్లినా , భర్త ప్రేమాయణం ఆగకపోవటంతో భార్య మీడియాకు చెప్పి రచ్చకీడ్చింది.

జిల్లాలోని ఆత్మకూరు పోలీసుస్టేషన్లో పని చేసిన రోజాలత అనే ఎస్సై అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న సాయి అనే కానిస్టేబుల్ తో సన్నిహితంగా ఉండేది. అది క్రమేపి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే పెళ్లైన ఆ కానిస్టేబుల్ కి భార్య ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ఈ వార్త జిల్లా పోలీసు వర్గాల్లో సంచలనంగా మారటంతో వారిద్దరినీ ఉన్నతాధికారుల వేర్వేరు పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు. అయినా వారి ప్రేమాయణం ఆగలేదు. లేడీ ఎస్సై కొన్నాళ్లు కానిస్టేబుల్ ఇంట్లోనే నివాసం ఉండటం మొదలెట్టింది.

ఇది నచ్చని కానిస్టేబుల్ భార్య రేఖ ఈవ్యవహారాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎస్పీ, దిశ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న రోజాలతను వీఆర్ కి పంపించారు. ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా వారి ప్రేమాయణం ఆగలేదు. రోజాలత ,కానిస్టేబుల్ సాయి ఇంటికే వచ్చి ఉండటం మొదలెట్టింది. దీంతో రేఖ స్ధానిక పోలీసుల సూచన మేరకు కలువాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

పదే పదే తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుండటం, ఇప్పటికే వీఆర్ లో ఉన్న ఎస్సై రోజాలత కోపోద్రిక్తురాలైంది. తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ సాయి ఇంటికి వచ్చి అతని భార్య రేఖతో తో వాగ్వాదానికి దిగింది. ఈ పరిస్ధితి వస్తుందని ముందుగానే ఊహించిన రేఖ ఈ సమాచారాన్ని మీడియాకు అందచేసింది. రోజాలత ఇంటికి వచ్చిగొడవ గొడవ చేసే సమయానికి రేఖ స్ధానిక విలేకరులకు సమాచారం పంపించింది.

వెంటనే అక్కడకు చేరుకున్న మీడియాను చూసి ఎస్సై అక్కడినుంచి చల్లగా జారుకుంది. కాగా కానిస్టేబుల్ పెంచల సాయిది కలువాయి మండలం బ్రాహ్మణపల్లి. కానిస్టేబుల్ ఇంట్లో.. లేడీ ఎస్సై కి, కానిస్టేబుల్ భార్యకి మధ్య జరిగిన గొడవతో ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.