Chicken: పలు ప్రాంతాల్లో కోళ్ల మృతి.. చికెన్‌ తింటున్నారా? అధికారులు ఏమంటున్నారంటే?

చికెన్‌ ప్రియులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

Chicken: పలు ప్రాంతాల్లో కోళ్ల మృతి.. చికెన్‌ తింటున్నారా? అధికారులు ఏమంటున్నారంటే?

Updated On : February 5, 2025 / 12:57 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కోళ్లు చనిపోతుండడంతో చాలా మంది ప్రజలు చికెన్‌ తినవచ్చా? లేదా? అన్న అనుమానాలతో వాటికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటివరకు గుర్తించని ఓ వైరస్‌ జాతి కోళ్లకు సోకుతుండడంతో కోళ్ల పెంపకందారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఒక్కొక్క కోడి దాదాపు రూ.300 చొప్పున ధర పలుకుతుంది. గుర్తు తెలియని వైరస్‌ సోకి మృత్యువాత పడుతుండడంతో చాలా చోట్ల వాటికి టీకాలు వేయిస్తున్నారు.

ఇటీవల కిలో చికెన్‌ ధర పెరగడంతో లాభాలపై ఆశలు పెట్టుకున్న వ్యాపారులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కోళ్లు చనిపోతుండడంతో నష్టపోతున్నవారు సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.

Also Read: వామ్మో.. పొలిటికల్ పార్టీలకు రూ.110 కోట్లు డొనేట్ చేసిన హైదరాబాద్ టెకీలు..!? ఇదెక్కడి స్కామ్‌రా మామా..

కోళ్లు చనిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు చికెన్‌, గుడ్లు తినేందుకు వెనకాడుతుండడంతో దీనిపై నిపుణులు స్పందించారు. చికెన్‌, గుడ్లను తినడం వల్ల ఎవరికీ అనారోగ్యం సంభవించలేదని స్పష్టం చేశారు.

ప్రజలు అనుమానాలు పడవద్దని అధికారులు చెప్పారు. చికెన్, గుడ్లు తినవచ్చని అంటున్నారు. కొల్లేరు సరస్సుకు వలస పక్షులు అధికంగా వచ్చాయని, దీంతో దానికి సమీపంలో కోళ్లు చనిపోయాయని అధికారులు భావిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ప్రజలు నిశ్చింతగా చికెన్‌ తినవచ్చని చెప్పారు. కాగా, పెరవలి మండలంలోని కానూరు అగ్రహారంలో అధికారులు 80 కోళ్ల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వాటిని భోపాల్‌ కేంద్రీయ ప్రయోగశాలకు పంపనున్నారు.