Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి
రెండో ఘాట్ రోడ్డులోంచి విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.

Leopard Attack On Tirumala Ghat Road
Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి చేసింది. రెండో ఘాట్ రోడ్డులోంచి విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
Also Read : ORR LED Lights : ఓఆర్ఆర్ పై ఏర్పాటు చేసిన లైట్లను ప్రారంభించనున్న కేటీఆర్
సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంబులెన్స్ లో ఇద్దరినీ తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. చిరుత రోడ్డు దాటే క్రమంలో ఇద్దరూ బైక్ పై రావటంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని వీజీవో బాలారెడ్డి అన్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారం ఎక్కువయ్యిందని… ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.