Lightning Strikes : వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగుపాటు

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటు కారణంగా గోపురానికి అక్కడక్కడా పగుళ్ళు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

Lightning Strikes : వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగుపాటు

Temple

Updated On : October 9, 2021 / 12:59 PM IST

Vedanarayana Swamy Temple : చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటు కారణంగా గోపురానికి అక్కడక్కడా పగుళ్ళు ఏర్పడ్డాయి. గోపురంపై ఉన్న రెండు చిన్న ప్రతిమల పెచ్చులు ఊడి కింద పడ్డాయి. గురువారం రాత్రి భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

ఈ క్రమంలో మెరుపుల దాటికి ఉత్తరమాడ వీధిలోని ప్రాకార ఆలయగోపురంపై పిడుగు పడడటంతో గోపురంపై ఉన్న దేవతా విగ్రహాలు విరిగి కింద పడ్డాయి. ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు గమనించి ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలావుంటే ఇటీవల మాడ వీధిలోని ఒక కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో ఆ చెట్టు కాలిపోయిందని స్థానికులు తెలిపారు.
Tirumala Brahmotsavam : సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుని అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి

గురువారం గోపురంపై పిడుగు పడి విగ్రహాలు ధ్వంసం కావడంతో భక్తులు కలత చెందుతున్నారు. గోపురానికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం దెబ్బతిన్న గోపురాన్ని పునర్నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం టీటీడీ అనుబంధ ఆలయంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలు హయాంలో 16వ శతాబ్దంలో వేదనారాయణ ఆలయ నిర్మాణం జరిగింది. తన తల్లి నాగమాంబ స్మారకంగా ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు.